క్రైం డెస్క్– పెళ్లి గురించి ఆ యువకుడు ఎన్నో కలలు కన్నాడు. పెళ్లయ్యాక భార్యను ఎంతో అపురూపంగా చూసుకోవాలని అనుకున్నాడు. ఎన్నో సంబంధాలును చూసిన తరువాత తమకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకేముంది ఆ యువకుడి ఆనందానికి హద్దే లేదు. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన ఆ అమ్మాయిని పువ్వులో పెట్టి చూసకుంటున్నాడు. కధ ఇలాగే సాగిపోతే బావుండు. కానీ అంతలోనే ఓ ట్విస్ట్ వచ్చింది.
పెళ్లైన పది రోజుల తరువాత హఠాత్తుగా ఓ రోజు కొత్తగా పెళ్లి చేసుకున్న తన భార్యకు కడుపు నొప్పి వచ్చింది. కంగారు పడిపోయిన ఆ యువకుడు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరిక్షించిన డాక్టర్ చెప్పిన మాట విని ఒక్కసారిగా ఆ యువడుకు కుప్పకూలిపోయాడు. ఇంతకీ ఏంజరిగిందో తెలుసుకోవాలంటే ఉత్తర్ ప్రదేశ్ వెళ్లాలి మరి. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ ప్రాంతానికి చెందిన ఓ యువతి, యువకుడికి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది.
పెళ్లి తరువాత ఆ నవ వధువు అత్తారింట్లో అడుగుపెట్టింది. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ యువకుడు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా కాపురం చేయసాగారు. ఈ క్రమంలో పెళ్లై సుమారు10 రోజులు గడిచిపోయాయి. ఇంతలో ఓ రోజు ఆ నవ వధువుకు ఉన్నట్టుండి తీవ్ర కడుపు నొప్పి వచ్చింది. దీంతో కంగారు పడ్డ ఆమె భర్త వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
ఆమెకు ఆస్పత్రిలో అన్ని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్, చివరికి పిడుగు లాంటి వార్తను చెప్పాడు. ఆ నవ వధువు అప్పటికే 8నెలల గర్భవతి అని డాక్టర్ చెప్పడంతో ఆ యువకుడికి ఒక్కసారిగా షాక్ తగిలింది. బాగా కోపోద్రిక్తుడైన ఆ యువకుడు విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. వధువుతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లికి ముందే వేరొకరిని ప్రేమించి, ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేసి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.