హైదరాబాద్- తప్పుడు పనులు చేసేవారు కొత్త కొత్త ఆలోచనలతో వస్తారు. పోలీసులకు చిక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అసాంఘీక కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉపాయాల మీద ఉపాయాలు ఆలోచిస్తారు. అయినా ఎప్పుడో ఒకప్పుడు పోలీసులను చిక్కడం మాత్రం సర్వసాధారణం. హైదరాబాద్ లో మసాజ్ సెంటర్ ముసుగులో బ్రోతల్ హౌజ్ నడుపుతున్న ముఠా ఆటను పోలీసులు కట్టించాారు.
హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతం, వీఐపీలు ఉండే బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12లోని ఓ మసాజ్ సెంటర్‌కు కొందరు వీఐపీలను తీసుకొచ్చి అశ్లీల కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే నిఘా విభాగం అధికారుల సహకారం తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ మసాజ్ సెంటర్‌పై దాడులు నిర్వహించారు. మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఈ సమయంలో ఆరుగురు అమ్మాయిలు, ఇద్దరు విటులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బయట చూడటానికి మాత్రం మసాజ్ చేస్తామంటూ బోర్డు పెట్టి, లోపల అశ్లీల వ్యవహారాలు కానిచ్చేస్తున్నారు. ఇటువంటి హైటెక్ వ్యభిచారం హైదరాబాద్‌లో చాలా కామన్ అయిపోయింది. మసాజ్ సెంటర్ల ముసుగులో పలువురు సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నారు. మాదాపూర్‌లోని ప్రముఖ స్టార్ హోటల్‌లో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిందే.