Oscars 2023: దేశ వ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందిరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. కేవలం సిల్వర్ స్క్రీన్‌పైనే కాకుండా ఓటీటీలోనూ చరిత్రను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మెప్పు పొందింది. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎదిగేలా చేసింది. వరుస అవార్డుల వేటలో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది.
ఈ సినిమా అకాడమీ అవార్డుల బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. బెస్ట్ ఇంటర్ నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో ఆస్కార్ పోటీలో ఉన్నట్లు సమాచారం. ఈ క్యాటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కచ్చితంగా అవార్డు గెలుచుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలు అంతర్జాతీయ సినిమా వెబ్ సైట్లు కూడా ఈ విషయాన్ని నొక్కి వక్కానిస్తున్నాయి. ‘‘ ఇండియా గత కొన్నేళ్లనుంచి ఆస్కార్ కోసం ఓ మంచి సినిమాను ఎంపిక చేయలేకపోతోంది.
కానీ, ఈ సారి అలా జరగదు. కచ్చితంగా బెస్ట్ ఇంటర్ నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకునే అవకాశం ఇండియాకు ఉంది’’ అని పేర్కొన్నాయి. కాగా, 1920 కాలంలో బ్రిటీష్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలలో నటించారు. ఇద్దరు యోధులు కలిసి బ్రిటీష్ ని అప్పట్లో ఎదురిస్తే.. ఎలా ఉంటుందనే ఆలోచనతో జక్కన్న ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమా గతంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుకు నామినేట్ అయిరన్నరప్ గా నిలిచింది. మరి, ఆస్కార్‌లో ఆర్‌ఆర్‌ఆర్ విజయం సాధించనుందని మీరు అనుకుంటున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : naga chaitanya: ‘ఆమె నా హృదయాన్ని ముక్కలు చేసి వెళ్లి పోయింది’.. నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్!