సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మరణంపై అతని కుటుంబసభ్యులు అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రాజు తల్లి మరికొన్ని ఆసక్తి కర విషయాలు చెప్పారు. బాలిక కనిపించకుండా పోయిన రోజు సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు రాజు తనకు ఫోన్ చేసి, తన భార్య మౌనికకు రూ.200 ఇవ్వాలని కోరాడు. అప్పుడు అతని వద్ద ఫోన్ లేదు. పక్కింటి వాళ్ల ఫోన్‌తో కాల్ చేశాడని ఆమె తెలిపారు. ఫోన్ మాట్లాడిన కొద్ది సేపటికే ఎవరో ఫోన్ చేసిన నేను పోలీస్‌ను సింగరేణి కాలనీలో నివాసముండే జ్వోతి ఇంట్లో డబ్బులు పోయాయని మీ అబ్బాయి దొంగిలించి ఉంటాడని అనుమానం ఉన్నట్లు చెప్పారు, నేను వెంటనే ఇంతకు ముందు ఫోన్ వచ్చిన నంబర్‌కు కాల్ చేసి విషయం కనుక్కొగా.. డబ్బులు కాదు పాప కన్పించడంలేదని, రాజుపైనే అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.
ఆ రోజు రాతిరంతా తమకు పోలీస్‌ల నుంచి ఫోన్లు వచ్చాయని తెలిపారు. మరుసటి రోజు ఉదయం పోలీసులు తమను హైదరాబాద్‌కు తరలించి రాజు దొరికితేనే తమను విడిచిపెడ్తామని, దొరక్కుంటే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని పోలీసు చెప్పినట్లు వెల్లడించారు. రాజు మరణవార్త తెలిసే ముందు రోజు రాత్రి తమను ఉప్పల వద్ద విడిచి వెళ్లారని రాజు దొరకకుంటే వదిలిపెట్టం అన్న పోలీసు తమను ఎందుకు వదిలిపెట్టారని దాని అర్థం వాళ్లకు రాజు దొరికిండనే కదా అని రాజు తల్లి ప్రశ్నించారు. పోలీసులే తన బిడ్డను చంపి పట్టాలపై పడేశారని ఆమె ఆరోపించారు.
తన బిడ్డ మంచి వాడే అని అప్పుడప్పుడు మద్యం సేవించేవాడని, అంబర్ తింటాడని అంతే తప్ప అంతకుమించి చెడు అలావాట్లు అతనికి లేవని ఆమె వివరించారు. చనిపోయిన తర్వాత అందరూ రాజు గురించి ఉన్నవిలేనివి కల్పి చెప్పున్నారని, బతికి ఉన్నప్పుడు అందరూ రాజు మంచొడనే వారని తెలిపారు. ఆ పాప శవం మా ఇంట్లో దొరికింది కాబట్టి అందరూ రాజును నిందితుడంటున్నారు తప్ప రాజునే ఈ హత్య చేశాడనే దానికి ఆధారం ఏంటని ఆమె ప్రశ్నించారు. నా బిడ్డను పోలీసులే చంపారని, ప్రాణానికి ప్రాణం తీశారని ఇప్పుడు రాజు బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాప కూడా ఆడపిల్లే, ఇప్పుడు తండ్రి లేక అనాథ అయింది పాపకు న్యాయం చేయాలని కోరారు.