ఫిల్మ్ డెస్క్- రాధే శ్యామ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ బ్యూటిఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటించగా, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చాలా రోజులుగా రాధే శ్యామ్ కోసం డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకువచ్చింది.
వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో తమ సినిమాను నిలుపుతున్నామని, జనవరి 14న రాధే శ్యామ్ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టి ఇప్పటికే కొన్ని పోస్టర్స్, ప్రభాస్ క్యారెక్టర్ కు సంబంధించిన టీజర్ ద్వారా రాధే శ్యామ్ పై భారీ అంచనాలను పెంచారు.
ఐతే నవంబర్ నెల వచ్చినా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ను అనౌన్స్ చేయడంలో మేకర్స్ ఆసక్తి చూపడం లేదని ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఓ అభిమాని అయితే ఏకంగా ఆత్మహత్య లేఖ రాసేశాడు. ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. ఇదిగో ఇటువంటి సమయంలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేయబోతున్నారని చిత్ర యూనిట్ నుంచి సమాచారం అందుతోంది. నవంబర్ 15న ఈ ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారట. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించిన ఈ పాట సినిమాలోని పాటల్లోకెల్లా హైలైట్ సాంగ్ కానుందని ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది.
రాధే శ్యామ్ మూవీ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పిస్తుండగా యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అబ్బురపరితే విజువల్ ఎఫెక్ట్స్, అత్యద్భుతమైన సెట్లతో రాధే శ్యామ్ ఒక గొప్ప ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.