ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ ని ఎంతకాలం కొనసాగిస్తారు అనేది వారు ఎంచుకునే కథల ఎంపికపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కథలు సరిగ్గా ఎంచుకున్నా.. గ్లామర్ వైపు పడాల్సిన మార్కులు కూడా సంపాదించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రాశిఖన్నా లాంటి యాపిల్ బ్యూటీలను రొమాంటిక్, గ్లామర్ రోల్స్ లో చూడాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువ.
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ ని ఎంతకాలం కొనసాగిస్తారు అనేది వారు ఎంచుకునే కథల ఎంపికపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు కథలు సరిగ్గా ఎంచుకున్నా.. గ్లామర్ వైపు పడాల్సిన మార్కులు కూడా సంపాదించుకోవాల్సి ఉంటుంది. అలాగని కేవలం గ్లామరస్ క్యారెక్టర్స్ కే ప్రాముఖ్యత ఇస్తే.. నటన పరంగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకప్పుడంటే ఇండస్ట్రీలో హీరోయిన్స్ సంఖ్య తక్కువ కాబట్టి.. వాళ్ళను జనాలు బాగా గుర్తు పెట్టుకుని ఆదరించేవారు. పైగా ఆయా హీరోయిన్స్ ఎలాంటి క్యారెక్టర్స్ చేసినా.. ఇలా ఎందుకు చేశారని ఫీల్ అయ్యేవారు కాదు. కానీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి.
అన్నింటికీ కొలమానాలు వచ్చేశాయి. నటన పరంగా, గ్లామర్ పరంగా అన్నివిధాలా ప్రేక్షకులను సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలను రేర్ గా ఆదరించే ఫ్యాన్స్.. రెగ్యులర్ గా గ్లామరస్ రోల్స్ లోనే చూడాలని అనుకుంటున్నారు. ఈ విషయం పైకి ఒప్పుకోక పోవచ్చు. కానీ.. దాదాపు హీరోయిన్స్ ని.. ముఖ్యంగా రాశిఖన్నా లాంటి యాపిల్ బ్యూటీలను రొమాంటిక్, గ్లామర్ రోల్స్ లో చూడాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువ. టాలీవుడ్ లో ముందు సింపుల్, పక్కింటి అమ్మాయి లాంటి క్యారెక్టర్స్ తో ఆడియెన్స్ కి దగ్గరైన రాశి.. ఆ తర్వాత మెల్లగా గ్లామర్ వైపు మళ్లింది. ఏకంగా ముద్దు సన్నివేశాలు, బెడ్ సీన్స్ తో షాకిచ్చింది.
ఢిల్లీ నుండి వచ్చిన ఈ బబ్లీ బ్యూటీ.. ఊహలు గుసగుసలాడే మూవీతో డెబ్యూ చేసి.. జిల్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, తొలిప్రేమ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ.. హిట్స్ ని మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, హిందీ సినిమాలు, సిరీస్ లతో మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తోంది. కాగా.. సినిమాల సంగతి పక్కన పెడితే.. రాశిఖన్నా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ముందే ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో సుమారు 9 మిలియన్ల ఫాలోయర్స్ ని సంపాదించుకున్న రాశి.. తాజాగా చాక్లెట్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. అందాలంటే మళ్లీ అట్టా ఇట్టా కాదు. చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమే. ప్రస్తుతం రాశి గ్లామరస్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి రాశి గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.