హీరోలు ఎలా ఉన్నా పర్లేదు కానీ హీరోయిన్స్ మాత్రం గ్లామర్‌గా కనిపించడానికి, ఫిట్‌గా ఉండడానికి ఫిజిక్ మెయింటెన్ చేస్తుండాలి. రెగ్యులర్ వర్కౌట్స్, స్కిన్ కేర్, హెల్త్ టిప్స్ అన్నీ పాటిస్తూ ఉండాలి. చాలా మంది ముద్దుగుమ్మలు తమ బ్యూటీ సీక్రెట్స్ రివీల్ చేసినప్పుడు జనాలకవి ఆశ్చర్యంగా అనిపిస్తాయి.
ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ ని ఎంతకాలం కొనసాగిస్తారు అనేది వారు ఎంచుకునే కథల ఎంపికపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కథలు సరిగ్గా ఎంచుకున్నా.. గ్లామర్ వైపు పడాల్సిన మార్కులు కూడా సంపాదించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రాశిఖన్నా లాంటి యాపిల్ బ్యూటీలను రొమాంటిక్, గ్లామర్ రోల్స్ లో చూడాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువ.