హీరోలు ఎలా ఉన్నా పర్లేదు కానీ హీరోయిన్స్ మాత్రం గ్లామర్‌గా కనిపించడానికి, ఫిట్‌గా ఉండడానికి ఫిజిక్ మెయింటెన్ చేస్తుండాలి. రెగ్యులర్ వర్కౌట్స్, స్కిన్ కేర్, హెల్త్ టిప్స్ అన్నీ పాటిస్తూ ఉండాలి. చాలా మంది ముద్దుగుమ్మలు తమ బ్యూటీ సీక్రెట్స్ రివీల్ చేసినప్పుడు జనాలకవి ఆశ్చర్యంగా అనిపిస్తాయి.
హీరోలు ఎలా ఉన్నా పర్లేదు కానీ హీరోయిన్స్ మాత్రం గ్లామర్‌గా కనిపించడానికి, ఫిట్‌గా ఉండడానికి ఫిజిక్ మెయింటెన్ చేస్తుండాలి. రెగ్యులర్ వర్కౌట్స్, స్కిన్ కేర్, హెల్త్ టిప్స్ అన్నీ పాటిస్తూ ఉండాలి. చాలా మంది ముద్దుగుమ్మలు తమ బ్యూటీ సీక్రెట్స్ రివీల్ చేసినప్పుడు జనాలకవి ఆశ్చర్యంగా అనిపిస్తాయి. రీసెంట్‌గా రాశీ ఖన్నా కూడా తను బరువు ఎలా తగ్గిందో చెప్పింది. అయితే దాంతో పాటు తన బాయ్‌ఫ్రెండ్ గురించి రివీల్ చేసి నెటిజన్లను తికమక పెట్టేస్తోంది. బ్రేకప్‌తో బరువు పెరిగానని, డేటింగ్ వల్ల నాజూగ్గా మారానని చెప్పి షాక్ ఇచ్చింది. ‘ఇన్నాళ్లూ సింగిల్‌గానే ఉన్నామనుకున్నాం.. ఏంటి లవర్ ఉన్నాడా? డేటింగ్ కూడా చేశావా? పెద్ద ముదురువే నువ్వు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘అప్పట్లో నేను ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నాను. అతడితో బ్రేకప్ అవడం వల్ల డిప్రెషన్‌కి గురయ్యాను. దీనికి తోడు నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండడంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను. తగ్గడానికి ఎన్నో వర్కౌట్స్ చేశాను కానీ వెయిట్ తగ్గలేకపోయాను. ఆఖరికి జిమ్ కోచ్‌ని మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ బరువు పెరగడం వల్ల నేను చేస్తున్న సినిమాల మీద ఎఫెక్ట్ పడింది. హీరోయిన్ వెయిట్ పెరిగితే ఆఫర్స్ ఎలా వస్తాయి? అయితే ఫైనల్‌గా నన్ను అర్థం చేసుకునే ఓ వ్యక్తి దొరికాడు. అతడితో డేటింగ్ స్టార్ట్ చేశాక బరువు తగ్గిపోయాను. నేను కోరుకున్నట్లు స్లిమ్ అయ్యాను’. అని చెప్పుకొచ్చింది. కట్ చేస్తే రాశీ ఓ వ్యక్తి అని చెప్పింది కానీ అతను ఎవరు, ఏంటి అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో ‘ఆ లక్కీ ఫెలో ఎవరబ్బా?’ అంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్స్.
రాశీ ఖన్నా గతేడాది ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ సినిమాలు చేసింది కానీ అవి ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతానికి టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లో బిజీ అయిపోయింది. అక్కడ రెండు చిత్రాలు చేస్తోంది. హిందీలో ‘యోధ’ లో నటిస్తోంది. ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంది. త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడెలాగో డేటింగ్ అని చెప్పింది కాబట్టి, త్వరలో ప్రియుడు ఎవరు?, పెళ్లెప్పుడు అనే విషయాలు చెప్తుందేమో మరి.
ఇది కూడా చదవండి : విడాకులు ఇచ్చినందుకు బాధ పడుతున్న ప్రముఖ నటి..