అందరు హీరోలు ఒక్కో సినిమాని పాన్ ఇండియా అంటూ రిలీజ్ చేస్తుంటే.. అన్ని భాషలలో సినిమాలు చేస్తూ ట్రూ పాన్ ఇండియా యాక్టర్ అనిపించుకుంటున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. బేసిగ్గా తమిళ యాక్టర్ అయినప్పటికీ.. తెలుగు, హిందీ ఇలా అన్ని భాషలలో తన సత్తా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు విజయ్ సేతుపతి. తెలుగులో ఉప్పెన సినిమాతో పాటు మరెన్నో డబ్బింగ్ సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తాను సినిమాలు చేస్తున్న ప్రతి భాషలో తన మార్క్ క్రియేట్ చేస్తున్న విజయ్ సేతుపతి.. తనను పాన్ ఇండియా స్టార్ అని పిలవడం బాలేదని ఓ యాంకర్ ముఖంపైనే చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
స్టార్ దర్శక ద్వయం రాజ్, డీకే హిందీలో కొత్తగా రూపొందించిన ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించాడు. ఫిబ్రవరి 10 నుండి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొన్న విజయ్.. పాన్ ఇండియా స్టార్ అని యాంకర్ సంబోధించడంతో రియాక్ట్ అయ్యాడు. “పాన్ ఇండియా ట్యాగ్ నాకు కంఫర్ట్ గా అనిపించదు. ఆ ట్యాగ్ కొన్నిసార్లు మాపై ఒత్తిడి పెంచుతుంది. నేను కేవలం ఒక నటుడిని మాత్రమే. ఇంకా వేరే లేబుల్స్ అక్కర్లేదు. అవకాశం వచ్చిన ప్రతి భాషలో నేను సినిమా చేయాలని అనుకుంటున్నా. ఛాన్స్ వస్తే బెంగాలీ, గుజరాతీలో కూడా సినిమాలు చేస్తాను” అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం విజయ్ సేతుపతి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కూడా యాంకర్ సుమపై సీరియస్ అయిన విషయం విదితమే. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా సూటిగా చెప్పేసరికి అందరు దీనిపై మాట్లాడుకుంటున్నారు. విజయ్ సేతుపతి మాటలను ఏకీభవిస్తూ ఇదే వెబ్ సిరీస్ లో నటించిన హీరోయిన్ రాశిఖన్నా కూడా స్పందించింది. కాగా.. ఇదివరకు బాలీవుడ్, కోలీవుడ్ అంటూ పిలిచేవారు.. ఇప్పుడు నార్త్ సౌత్ అంటున్నారు. అలా విభజించడం కరెక్ట్ కాదు. అందరం యాక్టర్స్ మాత్రమే.. సో.. ఆ పాన్ ఇండియా పదం పెద్దగా నచ్చదు అని చెప్పింది రాశీ. ఇక ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా కసాండ్ర లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఫిబ్రవరి 10 నుండి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి పాన్ ఇండియా ట్యాగ్ గురించి విజయ్ సేతుపతి రియాక్ట్ అయిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.