ఆమె హీరోయిన్ కమ్ సింగర్. ప్రస్తుతం మాత్రం సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఆమెకి ఫస్ట్ ఫస్టే ‘బాహుబలి’లో ఛాన్స్ వచ్చింది. మరీ క్యూట్ గా ఉండటం మైనస్ అయింది. అయితేనేం అద్భుతమైన లవ్ స్టోరీలో హీరోయిన్ గా నటించి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో బొద్దుగా, ముద్దుగా ఉన్న ఆమెని చూసి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఆమె తన ఫిజిక్ ని మార్చుకుంటూ వచ్చింది. కొన్నేళ్ల ముందు సన్నగా తీగలా మారిపోయింది. ఇప్పుడు నార్మల్ గా మారిపోయింది. ప్రస్తుతానికైతే ఆమెని చూసి కుర్రాళ్లకు నోటమాట రావడం లేదు. ఎందుకంటే రోజురోజుకీ అంత అందంగా తయారవుతుంది మరి. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇంతలా చెబుతున్నా కదా ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులోకి ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వాళ్లలో కొందరు మాత్రమే అందాన్ని కరెక్ట్ గా మెంటైన్ చేస్తూ, హీరోయిన్ ఛాన్సులు దక్కించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ రాశీఖన్నా ఒకరు. మిడ్ రేంజ్ హీరోలకు ఫస్ట్ ప్రయారిటీగా మారింది. అలా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ లో మొదలైన ఈమె జర్నీ.. గతేడాది వచ్చిన ‘థ్యాంక్యూ’ వరకు సాగింది. ప్రస్తుతం అయితే తెలుగులో సినిమాలేం చేయట్లేదు. తమిళం, హిందీలో తలో మూవీ చేస్తోంది. రీసెంట్ గా ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ తో మెప్పించింది.
చాలామంది రాశీఖన్నా పేరు చెప్పగానే హీరోయిన్ అనుకుంటారు. కానీ ఆమె మంచి సింగర్ కూడా. కెరీర్ స్టార్టింగ్ లోనే అంటే ‘జోరు’, ‘బాలకృష్ణుడు’, ‘జవాన్’, ‘ఊరంతా అనుకుంటున్నారు’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాల్లో తన గొంతు వినిపించింది. అలా ఇప్పుడు ఆమె చిన్నప్పుడు స్కూల్ ఏజ్ లో పాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అప్పటి, ఇప్పటి ఫొటోలు కంపేర్ చేస్తూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి రాశీఖన్నా చైల్డ్ హుడ్ పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.