కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల మృతి చెందిన సంగతి తెల్సిందే. పునీత్ గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పునీత్ మరణం ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నారు. పునీత్ సమాధిని అభిమానులు, ప్రజల సందర్శనార్థం అనుమతి ఇచ్చారు. సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా బెంగుళూరు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన సమాధికి నివాళులు అర్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పునీత్ రాజ్ కుమార్ మరణంతో గుండెపోటుతో కొంత మంది.. ఆత్మహత్యలు చేసుకొని కొంత మంది చనిపోయారు. ఇప్పటికే కర్ణాటకలో పునీత్ మరణం తట్టుకోలేక 8 మంది అభిమానులు మరణించారు. ఈ విషయమై పునీత్ భార్య స్పందించారు. పునీత్ మరణం మా కుటుంబానికి తీరని లోటు.. అప్పు లేడన్న విషయం మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాము… ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమకు ఎప్పుడు రుణపడి ఉంటాం.. ఆయన మన మధ్యలేకపోయినా మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆయనే లేని లోటును మేము అనుభవిస్తున్నాం.
దయచేసి మీ కుటుంబాలకు అలాంటి పరిస్థితి రానివ్వకండి. ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయకండి. దయచేసి ప్రతి ఒక్కరు దైర్యంగా ఉండండి.. ఇక నుంచి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పపడవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.