పునీత్ రాజ్ కుమార్.. కన్నడ చిత్ర పరిశ్రమలో తన నటన, డ్యాన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని పవర్ స్టార్ గా ఎదిగారు. ఇక హఠాత్తుగా గుండెపోటు రావటంతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఈ వార్త తెలియటంతో ఆయన అభిమనులు అంతా కన్నీటిపర్యంతానికి లోనయ్యారు. అయితే పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో ఇటు సినిమా పరిశ్రమే కాకుండా పారిశ్రామిక, రాజకీయ రంగాల నుంచి చాలా మంది ప్రముఖుల కడసారిగా పునీత్ పార్థీవ దేహాన్ని చూసి నివాళులర్పించారు. అయితే పునీత్ రాజ్ కుమార్ కు జంతువులంటే చాలా ఇష్టముండేది. ఆయనకు సాటి మనుషులే కాకుండా మూగ జీవాలను సైతం చేరదిశాడు.
అలా ఎన్నో కుక్కలను పునీత్ రాజ్ కుమార్ ఎంతో ఇష్టంగా పెంచుకున్నాడు. దీంతో వాటికి ఏం జరిగిన ఆయన తట్టుకోలేకపోయేవాడు. అప్పడప్పుడు తన పెంపుడు కుక్కలను సోషల్ మీడియా ఖాతాలో పునీత్ తన అభిమానులతో పంచుకునేవాడు. అలా పెంచుకున్న తన రెండు పెంపుడు కుక్కలు పునీత్ రాజ్ కుమార్ ఒక్కసారిగా కనిపించకపోవటంతో కన్నీటి పర్యంతమవుతున్నాయి. దీంతో పునీత్ చనిపోయిన నాటి నుంచి ఆ కుక్కలు ఆహారం తినకోకుండా బాధతో ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
ఇక మాటి మాటికి పునీత్ ఫోటో వద్దకు వెళ్లి ఆ రెండు కుక్కలు అటు ఇటు ధీనంగా చూస్తున్నాయి. అలా కుక్కల పునీత్ ఫోటో వద్దకు వెళ్లి చూస్తుండటంతో పునీత్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చివరికి పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్దకు ఆయన కుటుంబ సభ్యులు ఆ కుక్కలను తీసుకెళ్లారు. మరి.. మరణం తరువాత పునీత్ పై ఈ మూగ జీవాలు చూపిస్తున్న ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.