భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రత్యేక పరిచయం అక్కరలేదు. క్రికెట్ ని అభిమానించే ప్రతి ఒక్కరూ ధోనీ అంటే ఎంతో ఇష్టపడతాను. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లడు.. తన పని తాను చేసుకుంటూ కూల్ గా ఉంటాడు.
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేక అతిథులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. శుక్రవారం మహీ 42వ పుట్టిన రోజు వేడుకల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మిన్ను విరిగి మీదపడ్డా చలించని వ్యక్తిత్వంతో ఇప్పటికే కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. మైదానంలో కాస్త ఖాళీ దొరికితే చాలు ఓ కునుకు తీసేందుకు ఇష్టపడే మహీ.. గతంలో ఎయిర్‌పోర్ట్ వెయిటింగ్ హాల్‌లో కింద పడుకొని తన నిరాడంబరతను చాటుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించే మహీ.. తన పుట్టిన రోజును కూడా ఇదే తరహాలో జరుపుకొని అభిమానులను మరోసారి ఆశ్చర్యపరిచాడు. దేశ విదేశాల్లోని తమ అభిమాన ఆటగాడి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటే.. అతడు మాత్రం తనకే అలవాటైన శైలిలో స్పెషల్ గెస్ట్‌ల సమక్షంలో పుట్టిన రోజు జరుపుకున్నాడు.
ఇంతకీ ఎవరా ధోనీ స్పెషల్ గెస్ట్స్ అని ఆశ్చర్యపోతున్నారా! శుక్రవారం 42వ జన్మదినం జరుపుకున్న ధోనీ.. రోజంతా రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లోనే ఉన్నట్లు సమాచారం. పార్టీల సంస్కృతిని పెద్దగా ఇష్టపడని మహీ.. ఖాళీ సమయాల్లో తన ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేస్తు ఉంటాడనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మహీ తనకెంతో ఇష్టమైన పెంపుడు కుక్కలతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. జాయ్ ఫుల్ మూడ్‌లో కనిపించిన ధోనీ.. పెంపుడుకుక్కలకు కేక్ తినిపించడంతో పాటు కొన్ని ముక్కలు తానూ తిని సెలబ్రేట్ చేసుకున్నాడు. నాలుగు కుక్కలతో ధోనీ సరదాగా జరుపుకున్న సంబురాలకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. కొన్ని క్షణాల్లోనే అది వైరల్‌గా మారింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో చివరి సారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మహీ.. ఆ మరుసటి ఏడాది అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న ధోనీ.. ఇటీవల ముగిసిన 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలబెట్టి తన నాయకత్వ సత్తా తగ్గలేదని చాటిచెప్పుకున్నాడు.
MS Dhoni celebrating his 42nd birthday.
What a beautiful video! pic.twitter.com/lXQGg1N3bW
— Johns. (@CricCrazyJohns) July 8, 2023