దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. అకాల మరణవార్త ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులను శోకసంద్రంలోకి ముంచింది. నెలలు గడుస్తోన్న అప్పు(పునీత్) మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకున్నారు. ఎంతో భవిష్యత్ ఉందనుకున్న అప్పు అకస్మిక మరణం అటు సినీ పరిశ్రమను, ఇటు అభిమానులను ఎంతో కలచివేసింది. ఎంతో మంది పేదలకు, పేద పిల్లల చదువుకు తన వంతు సాయం చేసి వారి హృదయాల్లో దేవుడుగా నిలిచాడు. ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేక కొందరు అభిమానులు మరణించారు.
పునీత్ కు ఓ సంకల్పం ఉందని అయన మరణించాక తెలిసింది. మరణానికి ముందే గాజానూర్‌లోని తన తండ్రి సూపర్‌స్టార్ రాజ్ కుమార్, వారి పూర్వీకులు నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చాలని పునీత్ భావించారు. ఈ ఏడాది ఆగస్టులో భారీ వర్షాలు పడటంతో ఆ ఇల్లు చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఆ ఇంటిని పునరుద్ధరించి ఓ మ్యూజియంగా మార్చాలనుకున్నాడట. ఇందులో భాగంగా చనిపోవడానికి కొన్నిరోజుల ముందు గాజానూర్ లోని తన తండ్రి ఇంటిని సందర్శించి తగిన ప్రణాళికను రెడీ చేశాడు. ఇంతలో పునీత్ కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు.
ఇటీవల మధ్యలో ఆగిపోయిన పునీత్ రాజ్ కుమార్ సంకల్పాన్ని రాజ్ కుమార్ మేనల్లుడు గోపాల్ పూర్తి చేయడానికి ముందుకొచ్చాడు. శిథిలమైన రాజ్ కుమార్ ఇంటిని శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు గోపాల్. కేవలం రెండు నెలల్లోనే ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేసి దాని మ్యూజియంగా మారుస్తామని గోపాల్ తెలిపారు. డాక్టర్ రాజ్ కుమార్ నటజీవితం గాజానూర్ నుంచి ప్రారంభమైనది. అలాంటి ఇళ్లు శిథిలావస్థలో ఉండటం నన్ను కలచి వేసిందని, అందుకు పునరుద్ధరణకు పూనుకున్నానని గోపాల్ అన్నారు. మ్యూజియంగా పనులు పూరైన వెంటనే అందులో రాజ్ కుమార్ జీవిత సంఘటనలకు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన అరుదైన ఫోటోలను ప్రదర్శిస్తామని గోపాల్ తెలిపారు. చివరికి పునీత్ సకల్పించిన తన తండ్రి ఇంటిని మ్యూజియంగా మార్చాలన్న కోరిక ఈ విధంగా తీరనుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.