చిత్ర పరిశ్రమలో షూటింగ్స్‌తో కళకళలాడుతోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు సినిమాలన్నీ సెట్స్ మీదే ఉన్నాయి. కానీ ఈ సమయంలో ఊహించని ప్రమాదాలు, సంఘటనలు ఉపద్రవంలా వస్తున్నాయి
చిత్ర పరిశ్రమ షూటింగ్స్‌తో కళకళలాడుతోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు సినిమాలన్నీ సెట్స్ మీదే ఉన్నాయి. రాబోయే ఆరు నెలలు పండుగ సీజన్లు కావడంతో త్వరత్వరగా సినిమాలు పూర్తి చేసి.. థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఈ సమయంలో ఊహించని ప్రమాదాలు, సంఘటనలు ఉపద్రవంలా వస్తున్నాయి. టాలీవుడ్ సింగర్ మంగ్లీ, మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి షూటింగ్ సమయంలో గాయపడ్డారు. అయితే పృథ్వీ కాలికి గాయం కావడంతో సర్జరీ చేయాల్సి వస్తుంది. దీంతో మూడు నెలల పాటు షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇప్పుడు మరో యువ నటుడు తీవ్రంగా గాయపడ్డారన్న వార్త సినీ పరిశ్రమను కలిచి వేస్తుంది.
సినిమా షూటింగ్ సమయాల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి.. కామన్. అయితే.. పెద్ద ప్రమాదాలు జీవితాలను అతలాకుతలం చేస్తాయి. బామ్మ మాట బంగారు బాట సినిమా సందర్భంగా నూతన ప్రసాద్ ప్రమాదవశాత్తూ జారి పడి.. కాళ్లు విరిగిన సంగతి విదితమే. ఇప్పుడు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న నటుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. శాండిల్ వుడ్ ప్రముఖ నిర్మాత ఎస్ ఎ శ్రీనివాస్ కుమారుడు సూరజ్ అలియాస్ ధృవన్ ప్రమాదానికి గురయ్యారు. ఇతడు కన్నడ చిత్ర పరిశ్రమ దిగ్గజ, దివంగత నటుడు డా. రాజ్ కుమార్, పార్వతమ్మ (సోదరుడు కుమారుడు) దంపతులకు మేనల్లుడు. శనివారం ఊటీ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గుండ్ల పేట్ తాలూకాలోని బేగూర్ సమీపంలో మైసూర్-గుండ్లపేట్ హైవేపై అతడి బైక్- టిప్పర్ లారీని ఢీకొట్టింది.
ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని మైసూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అతడి కుడి కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో మోకాలి వరకు కాలిని తొలగించారు వైద్యులు. సినిమా రంగంలోకి వచ్చేందుకు అతడు పేరును థృవన్‌గా మార్చుకున్నాడు. సూరజ్‌ను చూసేందుకు నటుడు శివరాజ్ కుమార్, నిర్మాత చిన్నెగౌడ మైసూర్ చేరుకుని సూరజ్ కుటుంబాన్ని పరామర్శించారు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మలో సూరజ్ నటించారు. ఇటీవలే మరో రెండు ప్రాజెక్టులను ప్రకటించారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదిగేందుకు బాటలు వేసుకుంటున్న సమయంలో అతడికి ఈ ప్రమాదం జరిగింది.