ఇటీవల కాలంలో హార్ట్ స్ట్రోక్ కారణంగా చనిపోయిన సినీ ప్రముఖులు అనేక మంది ఉన్నారు. అయితే అందులోనూ యంగ్ టాలెండ్ ప్రాణాలు కోల్పోవడం సినీ పరిశ్రమను దిగ్ర్భాంతికి గురి చేసింది. కన్నడ పవర్ స్టార్, తెలుగు నటుడు తారకరత్న దీని బాధితులే. తాజాగా మరొక నటుడు కన్నుమూశారు.
గుండె పోటు సామాన్యులనే కాదు సెలబ్రిటీలను వదిలిపెట్టడం లేదు. ఇటీవల కాలంలో హార్ట్ స్ట్రోక్ కారణంగా చనిపోయిన సినీ ప్రముఖులు అనేక మంది ఉన్నారు. అయితే అందులోనూ యంగ్ టాలెండ్ ప్రాణాలు కోల్పోవడం సినీ పరిశ్రమను దిగ్ర్భాంతికి గురి చేసింది. కన్నడ పవర్ స్టార్ అలియాస్ అప్పు గుండె పోటుతో కన్నుమూసిన సంగతి విదితమే. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో తారకరత్న కూడా ఓ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ కుప్పకూలారు. అనంతరం కర్ణాటకలోని ఓ ఆసుపత్రిలో దాదాపు 20 రోజులకు పైగా చికిత్స పొందిన ఆయన.. ఫిబ్రవరిలో తుది శ్వాస విడిచి.. అభిమానులను శోక సంద్రంలో మునిగేలా చేశారు. ఇప్పుడు మరో యువ తరం నటుడు మరణించారన్న వార్త వచ్చింది. చలన చిత్ర, టీవీ రంగంలో ఎదుగుతున్న సమయంలో అతడు మృత్యువాత పడ్డాడు. కన్నడ నటుడు నితిన్ గోపి గుండె పోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 39 సంవ్సరాలే.
నితిన్ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా. కన్నడ ప్రముఖ లెజెండరీ నటుడు డాక్టర్ ష్ణువర్ధన్తో కలిసి హలో డాడీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో విష్ణువర్ధన్ కొడుకు పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అవివాహితుడైన నితిన్.. తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులోని ఇత్తమాడులోని ఓ అపార్ట్ మెంట్లో ఉంటున్నారు. శుక్రవారం ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినా.. చికిత్స స్పందించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ముత్తినంత హెంతి, కేరళి ద కేసరి, నిశ్శబ్ధ, చిర బాంధవ్య వంటి చిత్రాలలో కూడా ఆయన నటించారు. కన్నడలో పలు సీరియల్స్‌లో నటించి మెప్పించారు. బాలాజీ టెలీ ఫిల్మ్స్, శ్రుతినాయుడు నిర్మించిన పునర్వివాహ సీరియల్లో కూడా నితిన్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సీరియల్‌కు మంచి టీఆర్పీ వచ్చింది. భక్తి సీరియల్ హర హర మహాదేవ్ కొన్ని ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు. అలాగే ఓ తమిళ సీరియల్‌కు కూడా యాక్షన్, కట్ చెప్పారు. కొత్త సీరియల్‌కి దర్శకత్వం వహించడానికి సిద్ధమౌతున్న వేళ.. అతి చిన్న యవస్సులోనే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. అతడి మరణ వార్తతో కన్నడ ఎంటర్టైన్మెంట్ రంగం శోక సంద్రంలో మునిగి తేలింది.