ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితమే వివాహం అయ్యింది. కానీ తనను నమ్మి వచ్చిన భార్యను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఆత్మహత్యకు కారణం ఏంటంటే?
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ భోజ్ పురీ నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 26న ఆమె ఓ హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా మరొక ప్రముఖ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంపత్ మరణంతో బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల స్నేహితులు, సహ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితమే వివాహం చేసుకున్నాడు. తనను నమ్మి వచ్చిన అమ్మాయిని ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. ఆయన స్నేహితులు, ఆయనతో కలిసి నటించిన నటులు ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
కన్నడ బుల్లితెర నటుడు సంపత్ జే రామ్ (35) బెంగళూరు సమీపంలో ఉన్న నేలమంగళలో ఉన్న తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వార్త తెలిసిన తర్వాత కన్నడ బుల్లితెర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. అగ్నిసాక్షి లాంటి పాపులర్ సీరియల్స్ లో నటించిన సంపత్.. ఇటీవలే విడుదలైన శ్రీ బాలాజీ ఫోటో స్టూడియో సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా దర్శకుడు, ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించిన సంపత్ సన్నిహితుడు రాజేష్ ధ్రువ.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో సంపత్ గురించి భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. ‘నీవు దూరమయ్యావన్న వార్తను తట్టుకునే శక్తి మాకు లేదు. చాలా సినిమాలు చేయాలి. చాలా గొడవ మిగిలి ఉంది. నీ కలలు నిజం చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా నిన్ను పెద్ద పొజిషన్ లో చూడాలి. దయచేసి నోరు మూసుకుని తిరిగి రా’ అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు.
ఇక సంపత్ తో అగ్నిసాక్షి సీరియల్ లో నటించిన విజయ్ సూరియ మాట్లాడుతూ.. సంపత్ మంచి ఆఫర్ల కోసం ఎదురుచూశాడని, అవకాశాలు రాలేదన్న నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. సంపత్ స్నేహితులు, సహనటులు ఆయన మరణం పట్ల దుఃఖం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంపత్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఆయన ఆత్మహత్యపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సంపత్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ఎన్ఆర్ పురాలో జరిగాయి. సంపత్ కి ఏడాది క్రితమే పెళ్లి అయ్యింది. అయితే తనకు అవకాశాలు రాకపోవడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని.. చివరకు అది పీక్స్ స్టేజ్ కి వెళ్లడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కన్నడ బుల్లితెర పరిశ్రమ ప్రముఖ నటుడు మాంద్య రవి (54)ని కోల్పోయింది. ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన మరణించారు. ఇప్పుడు సంపత్ ఆత్మహత్యకు పాల్పడడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.