హిట్లర్ సినిమాలో చెల్లిగా నటించిన అశ్విని గుర్తుందా.. పాతికేళ్ల క్రితం బుల్లితెరను ఏలిన ఈ నటి.. ఉన్నట్లుండి పరిశ్రమకు దూరమయ్యింది. మరి ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది.. ఏం చేస్తోంది అంటే..
నటి అశ్విని.. ఈ పేరు చెప్పగానే ఈతరం వారికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఓ పాతికేళ్ల క్రితం.. బుల్లితెరను ఏలిన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకు ఈ అశ్విని ఎవరు అని ఆలోచిస్తున్నారా.. మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ సినిమా చూశారా.. దానిలో చిరంజీవి పెద్ద చెల్లెలి పాత్రలో నటించారు అశ్విని. ఈ సినిమాలో ఆమె చేసిన యాక్టింగ్ ప్రేక్షకులను ఎప్పటికి మర్చిపోలేరు. ఆమె నటన చూసి కన్నీళ్లు పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా విజయం సాధించినా.. తెలుగులో ఆమెకు చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి. వీటిల్లో కూడా మంచి పాత్రలను సెలక్ట్ చేసుకుని నటించారు అశ్విని.
ఇక అశ్విని తెలుగులో కన్నా కూడా తమిళం, మలయాళం చిత్రాల్లో అధికంగా నటించింది. పైగా ఈమె కన్నడకు చెందిన నటి. కానీ తెలుగింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో అంతరంగాలు, కళంకిత సీరియల్స్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బుల్లితెరను ఏలింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే అశ్విని ఇండస్ట్రీకి దూరం అయ్యింది. మరి ప్రస్తుతం ఆమె ఏం చేస్తోంది.. ఎక్కడ ఉంది అంటే..
తెలుగు వారికి అశ్వినిగా పరిచయమైన ఈ నటి పేరు రుద్ర. ప్రముఖ తమిళ డైరెక్టర్ భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన పుదు నెల్లు పుదు నాతు అనే మూవీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా విజయంతో మలయాళంలో వరుసగా సుమారు పదహారు సినిమాలలో నటించింది. అక్కడ రుద్రకి చాలా మంది అభిమానులు ఉన్నారు. తెలుగులో హిట్లర్, ఆంటీ, పోలీసు, పెళ్లి చేసుకుందాం సినిమాల్లో నటించింది. తెలుగులో అశ్వినికి సినిమాల కన్నా కూడా సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు దక్కింది.
అప్పట్లో ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయిన కళంకిత, అంతరంగాలు సీరియల్స్‌లో అశ్విని కీలక పాత్రల్లో నటించింది. ఆమె నటనకు తెలుగు మహిళా ప్రేక్షకులు నీరాజనం పట్టారు. సీరియల్స్‌లో ఆమె ఏడిస్తే.. టీవీ ముందున్న ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అందమైన రూపం, అద్భుతమైన నటనతో తెలుగింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్నారు రుద్ర అలియాస్ అశ్విని. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ చిత్రంలో అశ్విని కీలక పాత్రలో నటించి.. తన నటనతో మెప్పించింది. కొన్నాళ్ల పాటు తెలుగు బుల్లితెరను ఏలిన అశ్విని.. ఆ తర్వాత ఉన్నట్లుండి ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
అప్పటికే తెలుగులో టీవీ చానెల్స్ పెరగడం, కొత్త యాక్టర్స్ రావడంతో అశ్వినికి ఇక్కడ అవకాశాలు తగ్గాయి. దాంతో ఆమె క్రమంగా టాలీవుడ్‌కి దూరం అయ్యింది. ప్రస్తుతం అశ్విని సింగపూర్‌లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం అక్కడ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం తనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది అశ్విని. 45 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని అందం, గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోంది అశ్వని. సోషల్ మీడియాలో ఈమె ఫొటోలు చూసిన వారు.. వావ్ మేడం ఎంత అందంగా ఉన్నారు.. రీ ఎంట్రీ ఇవ్వొచ్చు కదా అంటున్నారు. మరి అశ్విని నటించిన సీరియల్స్‌లో మీకు బాగా నచ్చిన సీరియల్ ఏంటి.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.