ఫిల్మ్ డెస్క్- సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిల్లు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. సినిమా వాళ్ల వివాహ బంధం ఎన్నాళ్లు ఉంటుందో ఎవ్వరు చెప్పలేరు. ఏ సినిమా జంట ఎప్పుడు ప్రేమలో పడుతుందో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో, ఇక ఎప్పుడు విడిపోతుందో అంతా చకా చకా జరిగిపోతుంటుంది. అలా అని సినిమా వాళ్లంతా అంతే అని చెప్పలేం కాని చాలా వరకు సినిమా వాళ్ల పెళ్లిల్లు పెటాకులవుతుండటం సజహమే.
ఇదిగో ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పెళ్లి పెటాకులు కావడం ఖాయం అనే మాట గట్టిగా వినిపిస్తోంది. పదేళ్లలో ప్రియాంక చోప్రా జంట విడిపోవడం ఖాయమని జోస్యం చెబుతున్నాడు సినీ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్. నిక్ జోనాస్‌కు 10 ఏళ్లలో ప్రియాంక విడాకులు ఇస్తుందని ఆయన చెప్పడం కలకలం రేపుతోంది. ఈమేరకు కమల్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడంతో అది బాగా వైరల్ అవుతోంది.
ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేసి, ఆ తరువాత పెళ్లి చేసుకుంది. ఇదిగో అప్పటి నుంచి వీరిద్దరు అమెరికాలోనే కాపురం పెట్టారు. ఐతే ప్రియాంక చోప్రా వివాహ బంధం గురించి కమల్ ఆర్ ఖాన్ చేసిన ఈ కామెంట్లను అభిమానులు మండిపడుతున్నారు. అయితే నువ్వు కూడా మరో పదేళ్లకు చస్తావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వాళ్లు విడిపోవాలని కోరుకునే హక్కు నీకెక్కడిదని కమల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక వ్యక్తిగత విషయాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చితక్కొడతాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరి అన్యోన్యంగా ఉన్న ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ విడిపోతారని ఎందుకు చెప్పాలని అనిపించిందో కమల్ కే తెలియాలి.