ఫిల్మ్ డెస్క్- రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ఆది పురుష్ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మైథలాజికల్ చిత్రంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు చాలా సమయం పడుతుందని అంతా భావించారు. కానీ ఆశ్చర్యకరంగా డైరెక్టర్ ఓం రౌత్ కేవలం 103 రోజుల్లోనే ఆది పురుష్ షూటింగ్ కంప్లీట్ చేశాడు.
ప్రస్తుతం ఆది పురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో మూవీ టీం బిజీగా ఉంది. ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ లోని ప్రభాస్ శ్రీరాముడి లుక్ ను మూవీ టీం విడుదల చేసింది. ఈ క్రమంలో శ్రీరాముడిగా ప్రభాస్ లైవ్ లుక్ ఎలా ఉండనుందోనని ఆయన ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో ఆది పురుష్ లో ప్రభాస్ శ్రీరాముడిగా ఇలా ఉండనున్నాడంటూ న్యూ లుక్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. కానీ ఇది అసలైన లుక్ కాదని, కొందరు నెటిజన్లు, ఫ్యాన్స్ ఆసక్తి ఆపుకోలేక పలు శ్రీరాముడి పాత్రలకు ప్రభాస్ ఫొటోను జీఐఎఫ్‌లో ఎడిట్ చేసి షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా తమ అభిమాన హీరో ప్రభాస్ ను శ్రీరాముడి లుక్ లో చూసుకుని ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు.
అన్నట్లు ఆదిపురుష్ సినిమా మొత్తం బడ్జెట్ 400 కోట్లు అని తెలుస్తోంది. ఈ మూవీ 15 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20 వేల థియేటర్లలో ఒకేసారి రిలీజ్ కాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. మరోవైపు సలార్ షూటింగ్ పూర్తి కావొస్తోంది.
Fan Made Edit 💥
Imagine #Adipurush FL🏹#Prabhas pic.twitter.com/KKG0NpjwSc— _✨🎭.ℂ𝐨𝙽𝕋𝐢𝙽𝐞𝙽𝐓𝕒𝙻._𝐠𝚃._.𝐑𝕠𝙼𝐞𝕠._ (@_unluckyromeo__) January 29, 2022