కౌశిక్ రెడ్డి..తాజాగా ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది..హుజూరాబాద్ కాంగ్రెస్ లీడర్ గా ఉంటూ గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు గట్టి పోటీని ఇచ్చారు. స్థానికంగా ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయంగా బలమైన నేతగా ఉన్న ఈటెల రాజేందర్ ను ఓడగొట్టేంత పని చేసాడు కౌశిక్ రెడ్డి. స్థానికంగా బలమైన కాంగ్రెస్ నాయకుడిగా ఉంటూ రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి మంచి దమ్మున్న లీడర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కాలంలో కొన్ని కారణాల వాళ్ళ ఈటెల తెరాస పార్టీకి, తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశాడు. దీంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇక ఈ నేపథ్యంలోనే ఉపఎన్నికపై ఫోకస్ చేసిన కౌశిక్ రెడ్డి. అప్పటి నుండి పార్టీ నేతలతో టచ్ లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో దూసుకుపోయాడు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అది నాయకత్వం కూడా మొదట్లో టికెట్ కౌశిక్ రెడ్డికి ఇద్దామనే అనుకుంది. అలా అనుకుంటున్నా తరుణంలోనే కౌశిక్ రెడ్డి తెరాస మంత్రి కేటీఆర్ తో భేటీ కావటం దానికి కౌశిక్ రిప్లై ఇవ్వటంతో అంతా సద్దుమణిగింది. ఇక ఉన్నట్టుండి కౌశిక్ రెడ్డి ఇటీవల స్థానిక తెరాస నేతలతో ఫోన్లో మాట్లాడుతూ..మనకు ఈ సారి తెరాస నుంచి టికెట్ వస్తుందని, అందరు సిద్ధంగా ఉండాలని, ఏమైనా ఉంటె మనం కలిసి చూసుకుందామని అన్నారు.
ఇలా వరుసగా ఫోన్ కాల్ లీకవ్వడంతో కౌశిక్ బండారం బయటపడింది. దీంతో స్పందించిన కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసులు పంపి వివరణ కోరింది. దీంతో ఆగ్రహించిన కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ కొత్తగా ఎన్నికైన పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇక ఎలాగైనా కౌశిక్ కు తెరాస నుంచి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశతో ఉన్నా.. తెరాస నుంచి ఎటువంటి ప్రతిపాదన మాత్రం రావటం లేదు. ఇలా ఒక్క ఫోన్ కాల్ తో రాజకీయంగా ఎదుగుతున్న కౌశిక్ రెడ్డి ఇమేజ్ ఒక్కసారిగా డ్యామేజ్ అయ్యింది. మరి ఇంతకు కౌశిక్ రెడ్డిని తెరాస పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇస్తుందా..? ఒకవేళ ఇవ్వకపోతే రాజకీయంగా అయన పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి.