రాజస్థాన్ క్రైం- ఓ నీచుడికి తనకంటే 25 ఏళ్ల చిన్నదైన మైనర్ బాలికపై కన్ను పడింది. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మామూలుగా ఐతే ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయడానికి ఎవ్వరు ఒప్పుకోరని ఓ పధకం వేశాడు. ఆ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి, వెంట తీసుకెళ్లి అగాయిత్యానికి పాల్డడ్డాడు. అలా ఐతే ఆమెను తనకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఆ దుర్మార్గుడి పధకం.
ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని నాగోర్ ప్రాంతంలో జరిగింది. పెళ్లి చేసుకోవాలనే ఆశతో 15 ఏళ్ల బాలికతో పరారై, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడో నీచుడు. సుపకా గ్రామస్థుడైన రమేష్ గుణపాల్ అనే వ్యక్తి మైనర్ బాలికను మోసం చేసి తనవెంట తీసుకెళ్లాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె నమ్మి అతని వెంట వెళ్లింది. తీరా వెళ్లాక వాడు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు పిర్యాదు చేశారు.
ఆ బాలికను తీసుకెళ్లడానికి రమేష్ తండ్రి, వదిన కూడా అతనికి సహకరించారు. తనకు ఆ బాలికను ఇచ్చి పెళ్లి చేస్తారనే ఆశతోనే తాను ఇలా చేసినట్లు ఆ దుర్మార్గుడు కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో వాదోపవాదనలు విన్న పోక్సో యాక్ట్ కోర్టు రమేష్ గుణపాల్‌కు పదేళ్ల జైలు శిక్షతో పాటు, మూడు వేరు వేరు సెక్షన్ల ప్రకారం 80వేల జరిమానా కూడా విధించింది. ఇలాంటి వారిని ఉరి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.