జీవితంలో చేసే కొన్ని తప్పులు కడ వరకు వెంటాడుతూ ఉంటాయి. క్షణ కాలమైన శారీరిక సుఖం కోసం వెంపర్లాడుతూ వివాహేతర బంధాలకు లొంగిపోవడం కూడా ఈ కోవకే చెందుతుంది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఆ తల్లి చేసిన తప్పుని.., కొడుకుకి వచ్చిన ఓ వింత వ్యాధి బయట పెట్టేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..,
ఒడిశాకి చెందిన ఓ వ్యక్తి కుమారుడికి గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగలేకుండా వచ్చింది. అతని తండ్రి ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఢిల్లీలోని గురుగావ్ ఫోర్టీస్ ఆస్పత్రిలో అతని వ్యాధిని వైద్యులు కనిపెట్టారు. దాని పేరు ‘సికిల్ సెల్ అనీమియా’. అంటే.., విపరీతమైన కీళ్ల నొప్పుల వ్యాధి అనమాట.ఇది వంశపారంపర్యంగా.. అతి అరుదుగా వచ్చే వ్యాధి.
బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ మాత్రమే దీనికి పరిష్కారం. కానీ.., ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఈ వ్యాధి ఉంటేనే.. పిల్లలకి కూడా వస్తుందట. డాక్టర్స్ ఈ విషయాన్ని చెప్పగానే.., ఆ పిల్లాడి తండ్రి కూడా టెస్ట్ చేయించుకున్నాడు. కానీ.., అతనిలో ఆ వ్యాధి లక్షణాలు ఏమి కనిపించలేదు. ఎందుకైనా మంచిదని మరోసారి టెస్ట్ చేయించుకున్నాడు. అప్పుడు కూడా అదే ఫలితం. తన భార్య మాత్రం పదే పదే కీళ్ల నొప్పులు అనడం భర్తకి గుర్తు ఉంది. కానీ.., నాకు సికిల్ సెల్ అనీమియా లక్షణాలు లేకుండా.., కొడుక్కి ఈ వ్యాధి ఎలా వచ్చిందని ఆ తండ్రి ఆలోచనలో పడ్డాడు.
ఇంటికి వెళ్లి తన భార్యకి జరిగింది అంతా చెప్పి.., ఏదైనా తప్పు చేసి ఉంటే చెప్పమని నిలదీశాడు. వ్యాధి ఏదో సరిగ్గా తేలకుండా కుమారుడికి వైద్యం కష్టం అవుద్ది కాబట్టి ఆ తల్లి కూడా నిజాన్ని బయట పెట్టింది. “అప్పట్లో నాకు మీ స్నేహితుడితో వివాహేతర సంబంధం నడిచింది. కానీ.., చేసిన తప్పుని తెలుసుకుని, చాలా త్వరగానే ఆ రిలేషన్ నుండి బయటపడ్డాను. అయితే.., మన బాబు ఆ బంధం కారణంగా పుట్టాడని తాను గ్రహించలేకపోయానని” ఆ భార్య కన్నీరు పెట్టుకుంది. దీంతో.., 20 సంవత్సరాల క్రితం చేసిన ఓ తప్పుకి ఇప్పుడు ఆ కుటుంబం అంతా పాపం అనుభవించాల్సిన పరిస్థితి తలెత్తింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.