స్పోర్ట్స్ డెస్క్- న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో ఆతిథ్య కివీస్‌ను మట్టి కరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. మొట్ట మొదటి వరల్డ్ టెస్టు చాంపియన్ ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఓడించి నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించింది టీం బంగ్లాదేశ్.
బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ కు ఏ ఫార్మాట్ లో నైనా ఇదే మొట్టమొదటి విజయం కావడం విశేషం. మొమినల్ హక్ సారథ్యంలోని జట్టు చాలా యేల్లుగా ఊరిస్తున్న ఈ రికార్డును సాధించింది బంగ్లాదేశ్. ఈ అనూహ్య విజయంతో బంగ్లా ఆటగాళ్ల సంబరాలకు అంతే లేదని చెప్పాలి.
వైవిధ్యమైన పేస్ బౌలింగ్ తో న్యూజిలాండ్ వెన్ను విరిచిన ఇబాదత్ హొస్సేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఏడు వికెట్లతో మెరిసి అవార్డు అందుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 328 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణతో 169 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇక బంగ్లాదేశ్ 458 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించగా, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించింది.
Congratulations @BCBtigers. Well played on all fronts. #NZvBAN pic.twitter.com/EYCU1CpQWV
— BLACKCAPS (@BLACKCAPS) January 5, 2022