ఫిల్మ్ డెస్క్- నిహారికా కొణిదెల.. ఈ మెగా డాటర్ సినిమాల్లో, ఇంట్లోనే కాదు.. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అన్న సంగతి అందరికి తెలుసు. తనకు, తన కుటుంబానికి సంబందించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది నిహారిక. అన్నట్లు మొన్నా మధ్యే పోలీసు అధికారి కొడుకు చైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లై, అత్తారింట్లో అడుగుపెట్టినా కూడా తన రెగ్యులర్ హ్యాబిట్స్ ను మాత్రం మిస్ కావడం లేదు నిహారిక.
ఇదిగో ఇటువంటి సమయంలో నిహారిక షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పుడు సినీ తారలంతా హాలోవీన్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ నుంచి మొదలు హాలీవుడ్ వరకు నటీనటులంతా హలోవీన్ సంబరాల్లో భాగంగా వింత వేషాధారణలో కనిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం దెయ్యం వేషంలో ఓ వీడియో పోస్ట్ చేశారు కదా. ఇందులో భాగంగానే నిహారిక ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో తొలుత సామామూలు దుస్తుల్లో వచ్చింది నిహారిక. అక్కడ సోఫా మీద తాను వేసుకోవాల్సిన డ్రెస్ అలా పడేసి ఉంది. వెంటనే నిహారకి ఆ సోఫాపై ఇలా కూర్చొని అలా లేసింది. అంతే నిహారికా అంతకు ముందు వేసుకున్న డ్రెస్ మారిపోయి, సోఫాపై ఉన్న డ్రెస్ ఆమె ఒంటిపైకి వచ్చింది. అంతే కాదు డ్రెస్ ధరించడం చాలా ఈజీ అంటూ ట్యాగ్ కూడా చేసింది నిహారిక.
కాకపోతే కొత్త డ్రెస్ లో నిహారిక లుక్ కాస్త హాటుగా ఉండటంతో నెటిజన్స్ తలోరకంగా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి డ్రెస్సులు నీకెందుకు అక్కా అని కొందమంది, ఇదేం రోగమంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా నిహారిక డ్రెస్ చేంజ్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. అన్నట్లు పెళ్లి తరువాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక, ఇటీవలే తన తండ్రి, నటుడు నాగబాబు బర్త్ డే సందర్భంగా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించింది.