ప్రతి దేశానికి సంపదను సమాకూర్చే కొన్ని ప్రత్యేక వనరులు, పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటిల్లో పర్యాటక రంగం ఒకటి. ఈ పర్యాటక రంగం పై ఆధారపడి అనేక దేశాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో హాకాంగ్ ఒకటి. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా హాంకాంగ్ పర్యాటక రంగం బాగా దెబ్బతిన్నది. ఈక్రమంలో పునరుద్దరించేందుకు హాకాంగ్ దేశం నడుం బిగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే పర్యాటకులను ఆకర్షించేందుకుగానూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా సందర్శకులకు 5 లక్షల […]
వంటింట్లో ఎన్నో రకాల ఉపకరణాలను ఉపయోగిస్తూ ఉంటారు. వాటిలో గ్యాడ్జెట్స్ కూడా ప్రధానంగా ఉంటాయి. కానీ, అన్నింటి కంటే ప్రధానంగా ఉపయోగించేది, ఎక్కువ మంది కొనుగోలు చేసే వస్తువు మాత్రం గ్యాస్ స్టవ్ అనే చెప్పాలి. వెనుకటి రోజుల్లో అయితే స్టెయిన్ సెల్ స్టీల్ గ్యాస్ స్టవ్స్ బాగా వాడేవారు. కానీ, ఇప్పుడు మాత్రం గ్లాస్ టాప్ స్టౌవ్స్ ని వినియోగిస్తున్నారు. వాటిలో కూడా 3 బర్నల్స్, 4 బర్నల్స్ స్టౌవ్స్ నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. […]
ఎక్కడైనా సరే అధికార పార్టీ చేసే కొన్ని పనుల విషయంలో ప్రతిపక్ష పార్టీలు వివిధ రకాల ఆరోపణలు చేస్తుంటాయి. అంతేకాక పరిపాలను విషయంలో జరిగే లోపలను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేసేందుకు వినుత్నంగా నిరసనలు చేపడుతుంటారు. గుర్రంపై రావడం, గాడిదకు వినతి పత్రాలు ఇవ్వడం, రోడ్లపై వంటలు చేయడం.. ఇలా వివిధ రకాలుగా ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనలు తెలియజేస్తుంటాయి. అలానే పుదుచ్చేరిలోని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెరైటీగా తమ నిరసనలను తెలియజేశారు. స్కూల్ విద్యార్థుల అవతారం […]
సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంటాయి. సినిమా హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు చూస్తే భలే గమ్మత్తుగా అనిపిస్తుంటుంది. సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలవే కాదు.. క్రికెట్, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల ఫోటోలు కూడా సినిమా హీరోల మాదిరి చక్కెర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు అంటే సినిమా వాళ్ళు మాత్రమే ఫేమస్ అనేలా ఉండేది పరిస్థితి. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా హీరోల్లానే తయారవుతున్నారు. కాదు కాదు, […]
అంతర్గత శక్తులతో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే అద్భుత రచనలు చేయడంలో తన సృజనాత్మకతను ఓ పద్ధతి ప్రకారం పవిత్రమయంగా పనిచేయించడంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చూపే చొరవ అమోఘమని జంటనగరాల మేధో సమాజం ప్రశంసలు కురిపిస్తోంది. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ విశేష రచనా సంకలనమైన ఆంజనేయ ఉపాస్య సంచిక ‘నన్నేలు నా స్వామి’ మహాగ్రంథాన్ని గత సంవత్సరం భారతదేశ హోంశాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించి పురాణపండపై అభినందనల ప్రశంసలు వర్షించిన అపురూపఘట్టం కవిత్వ సాహిత్య […]
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో జైలు కూడా పంపిస్తారు. అయితే ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వారికి పోలీసులు చలాన్లు విధిస్తుంటారు. పోలీసులు విధించిన జరిమానాను కొందరు కట్టేస్తారు. అయితే పెండింగ్ చలాన్లు రాబట్టేందుకు ప్రభుత్వాలు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో పెండింగ్ చలాన్లు విషయంలో ప్రభుత్వాలు వాహనదారులకు బంపర్ ఆఫర్ లు ప్రకటించాయి. తాజాగా కర్ణాటక […]
ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ లో అడ్మిట్ అయిన మొదటిరోజుతో పోలిస్తే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా.. కుటుంబ సభ్యులకు భయం అనేది సహజం. అందుకే హిందూపురం నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తీసుకొచ్చినా.. అక్కడ కూడా పని అయ్యేలా లేదని.. విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ వెల్లడించారు. తారకరత్నను మెరుగైన వైద్యం […]
గట్టిగా నెల రోజులు కూడా కాలేదు. భారత-పాక్ క్రికెటర్లు వరసపెట్టి పెళ్లి చేసేసుకుంటున్నారు. గత కొన్నిరోజుల నుంచి తీసుకుంటే.. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, హరీష్ రౌఫ్.. తమ భాగస్వామితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఈ లిస్టులోకి పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది కూడా చేరిపోయాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక పాక్ క్రికెటర్లందరూ కూడా […]
నిన్న మొన్నటి వరకు గౌతం అదానీ గురించి మారుమూల జనానికి పూర్తిగా తెలియకపోవచ్చు. అపర కుబేరుడిగా, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఒక భారతీయుడిగా ప్రపంచానికి తానేంటో పరిచయం చేసుకున్నా, అతని పేరు పెద్దగా వినుండకపోవచ్చు. కానీ, ఎప్పుడైతే అమెరికన్ రీసెర్చ్ సంస్థ ‘హిండెన్ బెర్గ్’.. అదానీ కంపెనీ ఒక పేకమేడ అని నివేదిక ఇచ్చిందో.. ఆనాటి నుంచి ఆదానీయే ప్రపంచానికి ఒక వార్తలా మారారు. అదానీ సంపద తరిగిపోతోందని కొందరు, బిలియనీర్ల జాబితాలో ఆయన స్థానం గల్లంతయ్యిందని […]
భార్యాభర్తల బంధం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా కొనసాగాలంటే కనీసం ఒకరిలోనైనా అర్థం చేసుకునే గుణం ఉండాలి. భరించేవాడు భర్త అని పెద్దలు అన్నారు కాబట్టి.. మగవారు భార్య విషయంలో కొంత తగ్గి ప్రవర్తిస్తే మంచిది. ఎందుకంటే.. స్త్రీల మనస్తత్వం పురుషులతో పోల్చుకుంటే కొంత విచిత్రంగా ఉంటుంది. దానికి తోడు కుటుంబం, పిల్లల బాధ్యతల కారణంగా వారిలో కొంత అసహనం ఉండనే ఉంటుంది. అందుకే కొన్ని విషయాల్లో స్వేచ్ఛను కోరుకుంటారు. మరికొన్ని విషయాల్లో తమదే పైచెయ్యి కావాలని అనుకుంటారు. […]