క్రికెట్‌లో భారత్‌ను భారత్‌లో ఓడించడం అంత ఈజీ కాదు. ఈ విషయం న్యూజిలాండ్‌కు మరోసారి బోధపడి ఉంటుంది. ముంబైలో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా న్యూజిలాండ్‌పై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో భారత్ కైవసం చేసుకుంది. ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవాలని ప్రయత్నించిన బ్లాక్‌క్యాప్స్‌కు మరోసారి నిరాశే మిగిలింది. భారత గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం కోసం న్యూజిలాండ్ దాదాపు 66 ఏళ్లుగా ప్రయత్నిస్తుంది.
అందుకోసం మేటి జట్లను భారత్‌కు పంపుతూ.. విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది. భారత్‌లో చివరిసారిగా న్యూజిలాండ్ 1988లో ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ భారత్‌లో న్యూజిలాండ్‌కు ఒక టెస్ట్ సిరీస్‌లో గెలుపన్నదే లేదు. 1955-56 నుంచి ఇప్పటివరకు ఏకంగా 12 సార్లు భారతలో పర్యటించిన కివీస్ టెస్ట్ సిరీస్ మాత్రం గెలవలేకపోతుంది. దీంతో భారత్‌లో భారత్‌పై టెస్ట్ సిరీస్ విజయం న్యూజిలాండ్‌కు అందని దాక్షగానే మిగిలిపోయింది.