ఫిల్మ్ డెస్క్- నయనతార.. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఒక్క తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు, మళయాళ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో నయనతారకు మంచి క్రేజ్ ఉంది. అంతే కాదు సౌత్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ కూడా నయనతార కావడం విశేషం. అమె అందం, అభినయం, ఎంచుకునే కధలే ఇందుకు కారణమని చెప్పవచ్చు.
అన్నట్లు నయనతార పెళ్లి గురించి మనం చాలా రోజులుగా వింటున్నాం. అప్పట్లో తమిళ హీరో శింబుతో ప్రేమించిన నయనతార, ఎందుకో పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తరువాత కోరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమాయం సాగించినా, ఇద్దరికి మనస్పర్దలు రావడంతో అతనికి బ్రేకప్ చెప్పేసింది. సరిగ్గా మూడేళ్ల క్రితం తమిళ దర్శకుడు విగ్నేశ్ శివన్ తో నయనతార ప్రేమలో పడింది. అదిగో అప్పటి నుంచి వీరిద్దరి పెళ్లిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నయనతార, విగ్నేష్ నిండా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఎక్కడ చూసినా వీళ్లిద్దరే. జంట పక్షుల్లా ప్రేమలో విహరిస్తున్నారు. దీంతో నయనతార పెళ్లిపై ఎప్పటికప్పుడు వార్తలు ప్రచారం జరుగతూనే ఉంది. ఐతే నయన్, విగ్నేష్ పెళ్లిపై వీరిద్దరు ఎప్పుడు స్వయంగా మాట్లాడింది లేదు. కానీ వీళ్లిద్దరికి రహస్యంగా ఎంగేజ్ మెంట్ అయ్యిందని మాత్రం తెలుస్తోంది.
నయనతార ఎంగేజ్ మెంట్ రింగ్ అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. ఇదిగో ఇటువంటి సమయంలో ఓ ఇంటర్వ్యూలో తన ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ తెగ సిగ్గుపడింది నయనతార. అంతే కాదు తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌పై అడిగిన ప్రశ్నలకు మురిపెంగా సమాధానాలు చెప్పింది. చాలా కాలం తరువాత పెళ్లి అంశంపై నయనతార నుంచి సానుకాలమైన సమాధానం కావడంతో ఇప్పుడీ ఇంటర్వూ వైరల్ అవుతోంది. మరి త్వరలోనే నయనతార ఓ ఇంటిది కావాలని మనమూ కోరుకుందామా..