నయనానందకరమైన నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ల పెళ్ళి ఇటీవలే జరిగింది. అయితే వీరి పెళ్ళి ఎలా జరిగింది అనేది మాత్రం ఎవరికీ తెలియలేదు. కారణం పెళ్ళిని కూడా క్యాష్ చేసుకోవాలనుకోవడమే. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అని ఓ మహానుభావుడు అన్నట్టు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు కూడా సినిమాలే. మరి అలాంటి సినిమాని ఫ్రీగా చూపించేస్తారేంటి? అందుకే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో బేరం కుదుర్చేసుకుంది ఈ జంట. […]
కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహం ఆమె ప్రేమించిన వ్యక్తి డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో అంగరంగ వైభవంగా జరిగింది. మహాబలిపురంలోని ఓ రిసార్టులో గురువారం(జూన్ 9న) కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినిమా ఇండస్ట్రీలోని అతిరథమహారధుల సమక్షంలో జరిగింది. నయన్ పెళ్లికి రజినీ కాంత్ సహా షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లు అంతా కనిపించి అలరించారు. కానీ, టాలీవుడ్ నుంచి మాత్రం ఏ ఒక్క సెలబ్రిటీ నయన్- విగ్నేష్ పెళ్లికి హాజరుకాలేదని సమాచారం. అందుకు రెండు […]
దక్షిణాది సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ నయనతార గురించి చెప్పక్కర్లేదు. తమిళ, తెలుగు భాషలతో పాటు కన్నడ, మలయాళం సినిమాలు కూడా చేసి సౌత్ లో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. త్వరలోనే షారుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే.. వ్యక్తిగతంగా నయన్ కొన్నేళ్లుగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ సెలబ్రిటీల […]
సినిమా హీరోయిన్స్ అన్నాక పెళ్లయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పడం అనేది కామన్. కొందరు భర్తను ఒప్పించి సినిమాలలో కంటిన్యూ అవుతుంటారు. మరికొందరు భర్త మాటకు విలువిచ్చి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అయితే.. పెళ్లయ్యాక సినిమాలు చేయడం, చేయకపోవడం హీరోయిన్ ఇష్టం. కానీ, ఆ హీరోయిన్ నిజంగానే సినిమాలు ఆపేయాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం అది అభిమానులకు చేదువార్తే అవుతుంది. ప్రస్తుతం దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో కూడా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. […]
నయనతారకు టాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమెకున్న స్టార్డమ్ గురించి అందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలో కెరీర్ కు కొంతకాలం గ్యాప్ ఇచ్చింది. రీఎంట్రీ ఇచ్చిన తర్వత కూడా ఆమె స్థాయిని స్టార్ హీరోయిన్ గానే కొనసాగిస్తోంది. కొన్నాళ్లు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న నయన్ ప్రస్తుతం డైరెక్టర్, నిర్మాత అయిన విఘ్నేష్ శివన్ తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. మొదట మంచి స్నేహితులం […]
ఫిల్మ్ డెస్క్- నయనతార.. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఒక్క తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు, మళయాళ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో నయనతారకు మంచి క్రేజ్ ఉంది. అంతే కాదు సౌత్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ కూడా నయనతార కావడం విశేషం. అమె అందం, అభినయం, ఎంచుకునే కధలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. అన్నట్లు నయనతార పెళ్లి గురించి మనం చాలా రోజులుగా వింటున్నాం. అప్పట్లో తమిళ […]