నయనతారకు టాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమెకున్న స్టార్డమ్ గురించి అందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలో కెరీర్ కు కొంతకాలం గ్యాప్ ఇచ్చింది. రీఎంట్రీ ఇచ్చిన తర్వత కూడా ఆమె స్థాయిని స్టార్ హీరోయిన్ గానే కొనసాగిస్తోంది. కొన్నాళ్లు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న నయన్ ప్రస్తుతం డైరెక్టర్, నిర్మాత అయిన విఘ్నేష్ శివన్ తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. మొదట మంచి స్నేహితులం అని చెప్పిన ఇద్దరూ.. ఆ తర్వా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మంచిగా సెటిల్ అయ్యాక వివాహం చేసుకుంటాం అని అనౌన్స్ చేశారు.
ఇదీ చదవండి: జబర్దస్త్ యాంకర్ రష్మీకి నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్!
అయితే వీళ్ల పెళ్లి ఇప్పటికే జరిగిపోయిందని సినీ వర్గాల్లో టాక్ మొదలైంది. అందుకు తగిన సాక్షాలు కూడా పలు సందర్భాల్లో బయట పడ్డాయి. గోల్డెన్ టెంపుల్ కు వెళ్లిన నయన్- విఘ్నేష్ ఇద్దరూ ఆ క్రతువును దంపతుల్లా పూర్తి చేశారు. ఆ సమయంలోనూ బయటపెట్టలేదు. తాజాగా తమిళనాడులోని ఓ గుడికి వచ్చిన ఈ జంట అభిమానులకు షాకిచ్చారు. గుడిలోనుంచి బయటకు వచ్చే సమయంలో నయన్ నుదుటిన కుంకుమ పెట్టుకుంది. మామూలుగా పెళ్లి అయిన వాళ్లు మాత్రమే అక్కడ కుంకుమ పెట్టుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నయన్- విఘ్నేష్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నయన్- విఘ్నేష్ పెళ్లిపై వాళ్లే ఓ క్లారిటీ ఇస్తే బావుంటుందని టాక్ వినిపిస్తోంది. నయనతార- విఘ్నేష్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.