ఈ రోజుల్లో షో రూమ్స్ లో వాహనాల కొనుగోలు ఎంతో తెలికగా మారింది. అమ్మే వారికి మరింత సౌలభ్యంగా మారింది. కానీ అప్పుడప్పుడు కొంత మంది షోరూమ్ సిబ్బందికి చుక్కులు చూపిస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చిల్లరను చాలామంది ఇంట్లో ఉండే చిన్న డబ్బాల్లో, చిన్న పిల్లల కిట్టి బ్యాంకుల్లో వేస్తుంటారు. తాము ఎప్పటి నుంచో కూడబెట్టిన చిల్లరతో షో రూమ్ కి వెళ్లి వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. ఆ సమయంలో చిల్లర నాణేలు లెక్కించడానికి సిబ్బంది పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు.
ఒడిశాకు చెందిన వికాస్ అనే యువకుడు ఎప్పటి నుంచో ఒక బైక్ తీసుకోవాలని కల కనేవాడు. మొత్తానికి తాను కన్న కల సాకారం చేసుకోవడం విజయం సాధించాడు. ఇంతకీ ఆ యువకుడు ఏం కల కనేవాడు అంటే.. తన దగ్గర కూడబెట్టుకున్న సొమ్ముతో ఒక చక్కటి బైక్ తీసుకోవాలని..దానిపై షికారు చేయాలని అనుకునేవాడు. అది కూడా అందరిలా కాకుండా ఆ బైక్ ని వినూత్నంగా ఖరీదు చేయాలని భావించాడు. రూపాయి, రెండు రూపాయలు.. ఇలా మొత్తం నాణేలతోనే ద్విచక్ర వాహనం కొనాలని నిర్ణయించుకున్నాడు. అలా కొంత కాలంగా చిల్లర డబ్బు పోగు చేశారు.
మొత్తానికి వికాస్ అలా పోగు చేసిన డబ్బు రూ.62 అయ్యాయి.. వాటిని తీసుకొని దగ్గరలోని బైక్ షోరూమ్ కి వెళ్లాడు. ముందుగానే షోరూమ్ యజమానికి తన వద్ద ఉన్న నాణేల గురించి చెప్పడంతో అతడు ఒప్పుకున్నాడు. తనకు నచ్చిన స్కూటీని కొనుగోలు చేశాడు. వికాస్ కోరిక నెరవేరింది కానీ.. ఆ నాణేలను లెక్కించేందుకు మాత్రం షోరూం సిబ్బంది చాలా సేపటి వరకు కష్టాలు పడాల్సి వచ్చింది.