యంగ్ లేడీస్ ని, మహిళలను సుఖ పెట్టే ఉద్యోగం. రోజుకి జీతం రూ.10 వేల నుంచి లక్షల్లో ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ స్టోరీ చదవండి.
అమ్మాయిలను సుఖం పెట్టే ఉద్యోగం. శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, రోజుకి జీతం మాత్రం వేల నుంచి లక్షల్లో ఉంటుందంటూ ఇటీవల సోషల్ మీడియలో ఓ ప్రకటన వెలువడింది. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లోనే. ఉత్సాహంతో అప్లయ్ చేసుకోవడానికి లింక్ కోసం చూస్తున్నారా? తొందరపడకుండా ఒక్క నిమిషం ఆగండి. కానీ, ఇక్కడ ఓ ట్విస్ట్ నెలకొంది. ఇంతకు ఈ ఉద్యోగం ఏంటి? లక్షల్లో జీతం ఏంటి? అసలు స్టోరీ ఏంటనేది తెలుసుకోవాలనుందా? అయితే తప్పకుండా మీరు ఆ ఆర్టికల్ చదవాల్సిందే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మహానగరంలోని ఓ ప్రాంతంలో ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. ఓ ప్రేవేట్ కంపెనీలు పని చేస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నాడు. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఇదిలా ఉంటే.., ఇటీవల ఇతడికి సోషల్ మీడియాలో.. భర్తతో సుఖం పొందలేని మహిళలను, అమ్మాయిలను సుఖ పెట్టే ఉద్యోగం. మగవారి సామర్ధ్యాన్ని బట్టి రోజుకి రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు జీతం ఉంటుందనే ఓ ప్రకటన ఇతని కంటపడింది. ఇక మనోడు వెనక ముందు అస్సలు ఆలోచించకుండా అందులో ఉన్న ఓ నెంబర్ కు కాల్ చేశాడు. అటు నుంచి కాల్ లిఫ్ట్ చేసి ఓ మహిళ మాట్లాడింది. ఈ ఉద్యోగానికి ఎలా అప్లయ్ చేసుకోవాలంటూ ఆ యువకుడు అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. అంతా వివరించింది. దీంతో ఆ యువకుడికి లోపల సంతోషం తన్నుకొస్తుంది. కానీ, ఆ మహిళ పూర్తిగా మాట్లాడిన అనంతరం ఓ కండిషన్ పెట్టింది.
అదేంటంటే? మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ గా ముందుగా రూ.5 వేలు డిపాజిట్ చేయాలని కోరింది. ఏం ఆలోచించకుండా సరేనంటూ అతడు రూ.5 వేలు ఆ మహిళ అకౌంట్ కు సెండ్ చేశాడు. ఆ తర్వాత ఆమె ఆ యువకుడికి మళ్లీ కాల్ చేసి.. నీకు ఓ కోడ్ తో పాటు, ఓ నెంబర్ సెండ్ చేస్తాను. ఆ నెంబర్ కు కాల్ చేస్తే.. వాళ్లు ఎక్కడికి రావాలనే పూర్తి వివరాలు తెలియజేస్తారని చెప్పి ఫోన్ కట్ చేసింది. చాలా సేపు అయింది. ఆ యువకుడి ఆ మహిళ నుంచి ఎటువంటి నెంబర్, కోడ్ ఏదీ కూడా రాలేదు. దీంతో ఆ యువకుడు తిరిగి ఆ మహిళకు ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. కొన్ని రోజులు ఆగి మళ్లీ ఫోన్ చేశాడు. ఎంతకు ఆ మహిళ కాల్ లిఫ్ట్ చేయలేదు. తీరా మనోడికి అర్థమైంది ఏంటంటే? ఇదంతా మోసం అని గ్రహించాడు. ఇటీవల హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు మోసపోయిన ఆ యువకుడు ఎవరు? ఆ యువకుడిని మోసం చేసిన మహిళ ఎవరనే వివరాలు తెలియరాలేదు.