కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ని పెంచుతూ.. సీఎం యడ్యూరప్ప తమ పదవికి రాజీనామా చేశారు. నిజానికి గత సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్-జెడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది.
అయితే.., తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి అధికారం దక్కింది. ఆ సమయంలోనే యడ్యూరప్ప నాలుగవ సారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అయితే.., ప్రతిపక్షానికి, అధికార పక్షానికి మధ్య బలం విషయంలో పెద్ద తేడా లేకపోవడంతో యడ్యూరప్ప ఈ రెండేళ్ల పాలనలో నరకం అనుభవించారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని తెలియచేశారు.
ప్రస్తుతం యడ్యూరప్ప వయసు 78 సంవత్సరాలు. బీజేపీ పార్టీ సిద్ధాంతం ప్రకారం 75 సంవత్సరాల తరువాత ఏ నాయకుడు ప్రత్యక్ష రాజకీయాలలో ఉండటానికి వీలు లేదు. ఈ కారణంగానే యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.., తన వర్గానికి ఎలాంటి లోటు రాదన్న హామీ వచ్చాకనే యడ్యూరప్ప ఈ రాజీనామాకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే బీజేపీ అధిష్టానం కర్ణాటక నూతన ముఖ్యమంత్రి పేరుని ఖరారు చేయనుంది.