ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మరోసారి అధికారం దక్కిచుకునేందుకు భారీ హామీలతో మేనిఫెస్టో ప్రవేశపెట్టింది. ఈసారి మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట వేసినట్లు తెలుస్తుంది. ఇదివరకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాలు, రైతుల పైకి మంత్రి కారు ఎక్కించడం వంటి మచ్చలను మేనిఫెస్టోతో మాపుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. రైతులకు ప్రాధాన్యతనిస్తూ యూపీ సంకల్ప్ పత్ర్ పేరుతో కేంద్రమంత్రి అమిత్ షా, యోగి ఆదిత్యానాథ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రస్తుత ఎన్నికలలో రైతులు, మహిళల ఓటర్లను టార్గెట్ చేసి హామీలు […]
తమకి మేలు చేస్తే ప్రజాప్రతినిధులను ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. కానీ.., తమ సమస్యలను పట్టించుకోకపోతే మాత్రం ఎదురు తిరుగుతారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తా పాల్గొన్నారు. అయితే.. ఆ సమయంలో ఎమ్మెల్యేకి దగ్గరగా ఒక రైతు వచ్చి ఆయనపై చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఎమ్మెల్యేతో పాటు అక్కడి కార్యకర్తలు ఒక్క క్షణం పాటు […]
కర్ణాటక రాజకీయం.. సస్పెన్స్ సినిమాని తలపిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో గత రెండేళ్లగా రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే వస్తోంది. ఇక ఎట్టకేలకు ఇప్పుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో.., కర్ణాటక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఈ విషయంలో ఆశావాదులు ఎక్కువగా ఉండటమే ఇప్పుడు కమలనాధులను కలవర పెడుతోంది. ప్రస్తుతం కర్ణాటక హోం మంత్రిగా పని చేస్తున్న బసవరాజ్ బొమ్మై ఈ లిస్ట్ లో అందరి కన్నాముందున్నారు. […]
కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ని పెంచుతూ.. సీఎం యడ్యూరప్ప తమ పదవికి రాజీనామా చేశారు. నిజానికి గత సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్-జెడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే.., తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి అధికారం దక్కింది. ఆ సమయంలోనే యడ్యూరప్ప నాలుగవ సారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అయితే.., ప్రతిపక్షానికి, అధికార పక్షానికి మధ్య బలం విషయంలో పెద్ద తేడా లేకపోవడంతో యడ్యూరప్ప […]