తమకి మేలు చేస్తే ప్రజాప్రతినిధులను ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. కానీ.., తమ సమస్యలను పట్టించుకోకపోతే మాత్రం ఎదురు తిరుగుతారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తా పాల్గొన్నారు. అయితే.. ఆ సమయంలో ఎమ్మెల్యేకి దగ్గరగా ఒక రైతు వచ్చి ఆయనపై చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఎమ్మెల్యేతో పాటు అక్కడి కార్యకర్తలు ఒక్క క్షణం పాటు షాక్ గురయ్యారు. అక్కడే స్టేజిపై ఉన్న కొందరు ఆ రైతును అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు.ఇది ఎమ్మెల్యేపై పడ్డ చెంప దెబ్బ కాదని ప్రభుత్వ విధానాలు, పేలవమైన పాలన మరియు నిరంకుశపాలనకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై పడిన దెబ్బ అని సమాజ్ వాదీ పార్టీ నాయకులు అన్నారు.
A video of Pankaj Gupta , a @BJP4UP MLA from Unnao in UP purportedly being ‘slapped’ by a farmer during a recent public meeting has gone viral …incident reportedly 3 days ago … reasons unclear … however now there has been a patch-up… in a new video (in next tweet) pic.twitter.com/GDzfUXjuky
— Alok Pandey (@alok_pandey) January 7, 2022
చెంపదెబ్బ వ్యవహారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తా సత్వరం స్పందించి.. సదరు రైతుతో కలసి మీడియా సమావేశం నిర్వహించాడు. కానీ.., ఇక్కడే సేన్ రివర్స్ అయ్యింది. తాను ఎమ్మెల్యేపై ప్రేమగా చేయి ఊపుతున్నానని, అనుకోకుండా చేయి అలా తగిలిందని ఆ రైతు తెలిపాడు. ప్రతిపక్షపార్టీలకు విమర్శించాడానికి ఏమిలేక, తమ రాజకీయ భవిష్యతు కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ రైతు ఇంతకుముందు కూడా ఇలా చేసేవాడు అని ఎమ్మెల్యే పంకజ్ గుప్తా తెలిపాడు. వీటికి సంబంధించిన రెండూ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి.. ఈ సంఘటన పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.