అమ్మాయిలు అలంకార ప్రియులు. అందంగా కనిపించేందుకు పలు రకాల సౌందర్య సాధనాలను వినియోగిస్తూ ఉంటారు. ఇక ఏదైనా అకేషన్ ఉందంటే బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు.
అమ్మాయిలు అలంకార ప్రియులు. అందంగా కనిపించేందుకు పలు రకాల సౌందర్య సాధనాలను వినియోగిస్తూ ఉంటారు. ఇక ఏదైనా అకేషన్ ఉందంటే బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు. మొహంపై మొటిమలు, గుంతలు, ఫేషియల్ వంటివి చేయించుకుంటారు. వీటి కోసం వేల నుండి లక్షలు ఖర్చుపెడుతుంటారు. మహిళలు అందంపై రోజు రోజుకి శ్రద్ధ పెట్టడంతో.. బ్యూటీ పార్లర్లు, సెలూన్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ఒక్కసారి వీటిల్లోకి అడుగుపెట్టామంటే చాలు.. నెలకొకసారైనా దీని చుట్టూ తిరగాల్సిందే. ఇక నల్లగా ఉన్న వారిని తెల్లగా చేస్తామని చెప్పే మోసం అంతా ఇంతా కాదు. యాడ్స్, ప్రమోషన్స్ చూసి వెళ్లే మహిళలు చాలా మందే ఉన్నారు.
అయితే ఒక్కోసారి ఇందులో వాడే క్రీములు, ట్రీట్ మెంట్ బెడిసికొడుతుంది. అదే జరిగింది ఆ మహిళ విషయంలో. ముంబయిలోని ఓ మహిళకు ముఖంపై గుంతలు ఏర్పడంతో.. అంథేరీలోని కామదేను షాపింగ్ సెంటర్‌లోని గ్లో లక్స్ సెలూన్‌కు ఇటీవల వెళ్లింది. అయితే దీనికి హైడ్రాఫేషియల్ ట్రీట్‌మెంట్ చేస్తారని తెలిసి.. ఫీజు కింద రూ. .17,500 చెల్లించింది. చికిత్స తరువాత ఆమెకు ముఖంపై ఉన్న చర్మం మండినట్లు అనిపించింది. వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించింది. హైడ్రాఫేషియల్ ట్రీట్‌మెంట్ వల్ల ఆమె ముఖంపై పలు చోట్ల కాలిన గాయాలు అయ్యాయని, చర్మం దెబ్బతిందని డెర్మటాలజిస్ట్ వెల్లడించారు.
హైడ్రాఫేషియల్ అనేది రీసర్ఫేసింగ్ చికిత్స. ఈ ప్రాసెస్ ద్వారా ముఖంపై రంధ్రాలను క్లియర్ చేస్తారు. ఈ ప్రొసీజర్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. లైసెన్స్ పొందిన సర్టిఫైడ్ హైడ్రాఫేషియల్ బ్యూటీషియన్ మాత్రమే ఈ ట్రీట్ మెంట్ చేయడానికి అర్హులు. పార్లర్,సెలూన్స్‌లో వీరే ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ బ్యూటీ పార్లర్ కు వెళ్లిన మహిళ.. పూర్తిగా మొహం నల్లగా మారిపోయింది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ సదరు మహిళ స్థానిక కార్పొరేటర్ ప్రశాంత్ రాణే సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.