సాధారణంగా ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు శిశువులు జన్మించడం చూస్తుంటాం. అప్పుడప్పుడు ఒకే కాన్పులో ఎక్కువ మంది శిశువులు జన్మించిన సందర్భాలు ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండకపోవడం జరుగుతుంది.
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రక రకాల వార్తలు, వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారిపోతున్నాయి. ఒకప్పుడు టీవీలు, వార్తా పేపర్లలో వచ్చే వార్తలు చూస్తూ ప్రపంచంలోని విషయాల గురించి తెలుసుకునేవాళ్లం.. ఇప్పుడు సోషల్ మీడియాలో కనీ వినీ ఎరుగని ఫోటోలు, వీడియోలు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. తాజాగా ఓ మహిళ ఐదుగురు శిశువులకు జన్మనిచ్చిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఒక కాన్పులో ఒకరు లేదా కవలలు జన్మిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరి కన్నా ఎక్కువ మంది శిశువులు జన్మించడం వింటున్నాం.. కానీ అందులో కొంతమంది శిశువులే ఆరోగ్యంగా ఉండటం.. మిగిలిన వారు పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారని అంటారు. ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. వీరంతా ఆడపిల్లలే.. అయితే తల్లి పిల్లలు అంతా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నవజాతి శిశువులు బరువు తక్కువగా ఉండటంతో ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. జార్ఖండ్‌లోని ఇత్ఖోరి బ్లాక్‌కు చెందిన అనితా కుమారి.. వయసు 27 సంవత్సరాలు. సోమవారం రాంచీలోని రీమ్స్ హాస్పిటల్ లో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం తల్లీ బిడ్డలు క్షేమంగానే ఉన్నారని.. కాకపోతే పుట్టిన ఆడ పిల్లలు 750 గ్రాముల నుంచి 1 కేజి వరకు బరువు ఉన్నారని.. ఈ క్రమంలో శిశువులను నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ లో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. సాధారణంగా ఒక కాన్పులో ఒకరు లేదా కవలలు జన్మిస్తుంటారు.. అయితే ఒకే కాన్పులో ఐదుగురు శిశువులు జన్మించడం చాలా అరుదైన విషయం అని వైద్యులు తెలిపారు. రాంచీ లోని రీమ్స్ లో ఇలా ఒకే కాన్పులో ఐదుగురు శిశువులు జన్మించడం ఇదే తొలిసారి అని హాస్పిటల్ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి తల్లీ బిడ్డలు క్షేమంగానే ఉన్నారని అన్నారు.
रिम्स के महिला एवं प्रसूति विभाग में इटखोरी चतरा की एक महिला ने पांच बच्चों को जन्म दिया है। बच्चें NICU में डाक्टरों की देखरेख में हैं। डॉ शशि बाला सिंह के नेतृत्व में सफल प्रसव कराया गया। @HLTH_JHARKHAND pic.twitter.com/fdxUBYoPoP
— RIMS Ranchi (@ranchi_rims) May 22, 2023