దేశ వ్యాప్తంగా గత కొంత కాలంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గుండెపోటుతో మరణాలు సంబవిస్తూనే ఉన్నాయి. గుండెపోటు కి అనే కారణాలు ఉంటున్నాయని.. ఎక్కువగా వ్యాయామాలు చేసినా.. తీవ్రమైన ఒత్తిడికి లోనైనా హార్ట్ స్టోక్స్ వస్తున్నాయని అంటున్నారు.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా వరుస గుండెపోటు మరణాలు ప్రజల్లో భయబ్రాంతులు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి గుండెపోటు సంభవించేది. కానీ ఈ మద్య చిన్న వయసు ఉన్నవారికి కూడా గుండెపోటు రావడం ఒకింత కలవరానికి గురి చేస్తుంది. ఎంతో ఆరోగ్యంగా కనిపించేవారు అకస్మాత్తుగా హార్ట్ స్టోక్ తో కుప్పకూలి చనిపోతున్నారు. ఎక్కవగా వ్యాయామం చేసినా.. పని ఒత్తిడికి గురైనా, దీర్ఘమైన ఆలోచనలు ఉన్నా హర్ట్ ఎటాక్ వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. కారణాలు ఏవైనా వరుస గుండెపోటు మరణాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి హార్ట్ స్టొక్ రావడంతో కన్నుమూశాడు. ఈ ఘటన నాగ్‌పూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రాంచీ నుంచి పూణే కి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తికి హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించిపోయింది. విపరీతంగా ఛాతి నొప్పి వస్తుందని ప్రయాణీకుడు బాధపడటంతో వెంటనే విమానాన్ని నాగ్ పూర్ కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయ అధికారి మాట్లాడుతూ.. ‘ఇండిగో విమానం టెకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ప్రయాణికుడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వెంటనే విమానాన్ని నాగ్‌పూర్ విమానాశ్రమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని.. ప్రయాణికుడిని ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికీ అతను గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు’ అని అధికారి తెలిపారు.
ఇండిగో విమానం నెం. 6E-672 గురువారం రాత్రి రాంచి నుంచి పూణే కి బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సమయం తర్వాత విమానంలో ప్రయాణిస్తున్న 73 ఏళ్ల ప్రయాణికుడిగా అకస్మాత్తుగా బీపీ ఎక్కువ కావడంతో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ప్రయాణికుడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన విషయం పైలెట్ కి తెలిపారు. ఆ ప్రయాణికుడి ప్రాణాలు రక్షించే క్రమంలో పైలెట్ నాగ్‌పూర్ విమానాశ్రయంలోని ఏటీసీని సంప్రదించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి కోరాడు. ఏటీసీ నుంచి పరిమిషన్ రావడంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్ చేశారు. వెంటనే ప్రయాణికుడిని కిమ్స్ – కింగ్స్ వే హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆ వృద్దుడి గుంటెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
A Ranchi-Pune IndiGo flight made unscheduled landing at Nagpur airport due to medical emergency #Ranchi #IndiGo #Pune https://t.co/v5uMGd9Kzg
— Republic (@republic) March 18, 2023