కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన విషయంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో పరిపాలనలో కీలకమైన పోలీసు, ఇతర ముఖ్య అధికారుల విషయంలో కూడా ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుంటాయి. తాజాగా మద్యానికి బానిసైన పోలీసు అధికారుల విషయంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన విషయంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో పరిపాలనలో కీలకమైన పోలీసు, ఇతర ముఖ్య అధికారుల విషయంలో కూడా ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలా సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా మద్యానికి బానిసలైన పోలీస్ అధికారుల విషయంలో అస్సాం ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. అధికారం చేపట్టిన తొలినాటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల విషయంలో ఇప్పటికే కొన్ని ఆస్తకికర నిర్ణయాలు తీసుకోగా.. తాజాగ పోలీసు శాఖపై దృష్టి సారించారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో ప్రక్షాళన చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. ఈక్రమంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యానికి బానిసగా మారి.. శారీరక ధారుడ్యం దెబ్బతిన్న 300 మందికిపైగా పోలీసుల అధికారులు, కానిసేబుళ్లను వీఆర్ఎస్ కు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం ఆదివారం ప్రకటించారు. ఇది పాత నిబంధనే అయినా, గత ప్రభుత్వం అమలు చేయలేదని సీఎం చెప్పారు.
ఈనిర్ణయానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనది, అలానే పోలీస్ శాఖలోని ఖాళీల భర్తీకి నియామక ప్రక్రియ మొదలైందని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ బాధ్యతలను సీఎం హిమంత బిశ్వశర్మ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వివరాలను వెల్లడించారు. అసోంలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం హిమాంత బిశ్వ శర్మ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరి.. అస్సాం ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.