ఈ మద్య యువత ప్రేమ విషయాన్ని చాలా సింపుల్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. చొక్కా మార్చినంత ఈజీగా లవర్స్ ని మార్చేసుకుంటున్నారు. నచ్చితే డేటింగ్.. లేదంటే గుడ్ బాయ్ అన్న చందంగా సాగుతుంది. ఒకప్పుడు భారత దేశంలో ప్రేమకు ఎంతో విలువ ఇచ్చేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అంతా వెస్టన్ స్టైల్లో ప్రేమికులను ఇట్టే మార్చుకుంటున్నారు. అలా అని అందరు ప్రేమికులు అలా కాదనుకోండి. కొంతమంది వ్యామోహంతో ప్రేమ అంటూ తిరుగుతున్నారు. ఆ తర్వాత బాగా ఆస్తిపాస్తులన్న వారిని చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. తాజాగా ఓ యువతి పెళ్లి జరుగుతుంది.. అంతలోనే వధువు మాజీ ప్రేమికుడు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో చోటుచేసుకుంది. అచ్చం సినిమా సీన్ తలపించేలా.. నిజ జీవితంలోనూ ఇలాంటి ట్విస్ట్ చూసి పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. గోరఖ్ పూర్ లోని హర్ పూర్ లో బంధుమిత్రుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. నూతన వధూ వరులు దండలు మార్చుకొనే సమయంలో ఒక యువకుడు ముఖానికి కండువా కప్పుకొని వేదికపైకి సడెన్ గా ఎక్కాడు. వధువు నుదుటి మీద బొట్టును పెట్టాడు. హఠాత్తుగా వచ్చిన యువకుడి నుంచి నవ వధువు తప్పించుకునే ప్రయత్నం చేసింది.. కానీ ఆ యువకుడు మాత్రం వధువు నుదుటి మీద బలవంతంగా సింధూరం దిద్దాడు. ఈ హఠాత్ పరిణామానికి పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు.
బంధువులు యువకుడిని అడ్డుకొని చితకబాదారు. తర్వాత తెలిసింది.. ఆ యువకుడు వధువు మాజీ ప్రేమికుడు అని.. కొన్ని నెలల క్రితమే పని నిమిత్తం ఊరు బయటకు వెళ్లాడని తెలుస్తోంది. యువతికి తల్లిదండ్రులు పెళ్లి చేయబోతున్నారన్న విషయం తెలుసుకున్న ఆ ప్రేమికుడు తన ప్రేమను సినిమా స్టైల్ లో చూపించాలని పెళ్లిపందిరిలో హంగామా సృష్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.