దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతాచర్యలు ఎంత కఠినంగా వ్యవహరించినా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు సంబవిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ డిఒరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గౌరీబజార్-రుద్రాపూర్ రోడ్డులోని ఇందూపూర్ కాళీ మందిర్ కి వస్తున్న ఎస్ యూవీ ఒకటి మూల మలుపు వద్ద బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలు ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
ఎస్ యూవీ రుద్రపూర్ రోడ్డు మీదుగా వస్తున్న సమయంలో కాళీ ఆలయం సమీపంలో ఎదురుగా అతి వేగంగా వచ్చిన బస్సును ఢీ కొట్టడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఒరియా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీపతి మిశ్రా తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే వెంటనే సమాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.