సాధారణంగా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు బయట కార్యక్రమాలకు వెళ్లినప్పుడు వారి వెంట బాడీగార్డులు, బౌన్సర్లు కనిపిస్తుంటారు. ఇలాంటి వారికి అభిమానులతో పాటు.. హాని చేసేవారు కూడా ఉంటారు. అందుకే రక్షణ కోసం గన్ మెన్ లను ఏర్పాటు చేసుకుంటారు. ఉత్తర్ప్రదేశ్ లో చిన్న బండిపై బట్టలు అమ్ముకుంటూ బతికే ఓ వ్యక్తికి ఏకంగా ఇద్దరు భద్రతా సిబ్బంది కాపలాగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ లో రామేశ్వర్ దయాల్ చిన్న బండిపై బట్టలు అమ్ముకుంటూ బతుకు వెల్లదీస్తున్నాడు. రామేశ్వర్ దయాల్ తన స్వగ్రామంలో కాస్త భూమి ఉంది. అయితే దానికి ఎలాంటి పట్టా లేకపోవడంతో ఆ మద్య మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడైన జుగేంద్రను కలిశాడు. ఆ క్రమంలో వీరిద్దరి మద్య కొంత వివాదం నెలకొంది. అంతేకాదు జుగేంద్ర తనను ఘోరంగా అవమానించాడని.. కులం పేరుతో దూషించాడని దయాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై జుగేంద్ర సింగ్ హై కోర్టుకు వెళ్లాడు.
రామేశ్వర్ దయాల్ చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు అని.. తనపై ఉన్న కేసులు కొట్టి వేయాలని కోరారు. దీంతో రామేశ్వర్ దయాల్ ని శనివారం కోర్టుకు హాజరు కవాలాలని ఆదేశించింది. దీంతో రామేశ్వర్ కోర్టుకు భయం భయంగా రావడం చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. అతనికి ప్రత్యర్థుల నుంచి భయం ఉంది.. ఎందుకు భద్రత కల్పింలేదని పోలీసులను ప్రశ్నించారు.
ఆ రోజు నుంచి రామేశ్వర్ దయాల్ కి ఇద్దరు గన్ మెన్ లనే ఏర్పాటు చేశారు. ఆ గన్ మెన్లు ఏకే – 47 తో రక్షణ కల్పిస్తున్నారు. బట్టలు కొనడానికి వచ్చిన వినియోగదారులు.. రామేశ్వర్ బాడీగార్డ్స్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.