పోలీస్ స్టేషన్ లపై, పోలీసులపై ప్రజలు తిరగపడి దాడులు జరిగిన ఘటనలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. పోలీసుల వైపు తప్పు ఉండోచ్చు, ప్రజల వైపు ఉండోచ్చు. ఏది ఏమైనప్పటి ఇలాంటి ఘటనలు తరచు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా విచారణ పేరుతో ఓ వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి మృతిచెందాడు. దీంతో పోలీసులే చంపేశారంటూ మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమం స్థానిక పోలీస్ స్టేషన్ ని గుర్తుతెలియని వ్యక్తులు తగలపెట్టారు. ఈ ఘటన అసోం రాష్టరంలోని నగాన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
అసోం రాష్ట్రంలో నగాన్ జిల్లాలోని బటద్రవా పోలీస్ స్టేషన్ పరిధిలో సఫీకుల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఏదో కేసు పేరుతో శుక్రవారం సఫీకుల్ ను బటద్రవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రూ.10వేలు లంచంగా ఇస్తే విడిచిపెడతామని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు చెబుతూ.. వారి ముందే సఫీకుల్ ను పోలీసులు కొట్టినట్లు స్థానికులు ఆరోపించారు. అయినా రూ.10 వేలు తీసుకుని సఫీకుల్ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌కు వెళ్లగా.. అప్పటికే అతడ్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారని స్థానికులు తెలిపారు. ఈక్రమంలో పోలీసుల దెబ్బలకు గాయపడిన సఫీకుల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.
ఇదీ చదవండి: బీర్ల లారీ బోల్తా.. బీర్ల కోసం ఎగబడ్డ జనం.. వీడియో వైరల్!
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు.. పోలీసు స్టేషన్‌ను ముట్టడించి నిప్పంటించారు. ఈ ఘటనపై నగాన్ జిల్లా ఎస్పీ స్పందిస్తూ..”కొందరు దుండగులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి నిప్పంటించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. దర్యాప్తు చేసి మిగతా నిందితులను పట్టుకుంటాం. అయితే లంచం డిమాండ్ ఘటనపై పోలీసులు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం” అని లీనా డోలీ తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.