ఈ భూమిపై పిల్లలను తల్లిదండ్రులు ప్రేమించినంతగా మరేవరు ప్రేమించలేరు. అందుకే అమ్మనాన్న ప్రేమ ఆకాశమంత అని పెద్దలు అంటుంటారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే కూతుళ్లు.. తల్లి కంటే తండ్రి అంటేనే ఎక్కువ ఇష్టపడుతుంటారు. కారణం.. నాన్న అడిగినది కాదనకుండా కూతురికి అందిస్తుంటారు. ప్రతి విషయంలోనూ కూతుర్ని వెనకేసుకు గారభంగా చూసుకుంటారు. ఎన్ని బంధాలు ఉన్నా తండ్రీకూతుళ్ల మధ్య ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గనిది. అందుకే తండ్రీకూతుళ్లు.. వారిద్దరిలో ఎవరు బాధపడ్డా రెండో వాళ్లు తట్టుకోలేరు. తాజాగా ఓ కుమార్తె కూడా తన తండ్రి కోసం లివర్ ఇవ్వడానికి సిద్ధమైంది. తాను మైనర్ నని తెలిసి కూడా తన తండ్రికి లివర్ని ఇచ్చేందుకు హైకోర్టు నుంచి అనుమతి వచ్చేలా పట్టుదలతో కృషి చేసింది. చివరకు విజయం సాధించింది. ఈ ఘటన కేరళలాలో చోటుచేసుకుంది.
కేరళకు చెందిన ప్రతీశ్(48) స్థానికంగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి దేవానంద(17) అనే కుమార్తె ఉంది. ఆమె ఇంటర్ చదువుతోంది. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ప్రతీశ్ కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. ఆయనకు ఎవరైన కాలేయం దానం చేస్తే కానీ ప్రాణాలతో బయటపలేని పరిస్థితి. ఈ క్రమంలో లివర్ దానం చేసే వారి కోసం ఎంత ప్రయత్నించి ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన కుమార్తె దేవానంద.. తండ్రి పడుతున్న బాధను చూసి తట్టుకోలేపోయింది. ప్రతీశ్ కు లివర్ దానం చేసేందుకు దేవానంద సిద్ధమైంది. అయితే ఎవరైన అవయవదానం చేయలంటే 18 ఏళ్లు నిండి ఉండాలి. అయితే అప్పటికి దేవానంద మైనర్. దీంతో వైద్యులు కాలేయ దానానికి అనుమతించలేదు. వైద్యులు తిరస్కరించిన దేవానంద వెనక్కి తగ్గలేదు. తన తండ్రిని ఎలాగైనా ఆరోగ్యం ఉండేలా చేయలని అనుకుంది. అవయవదానికి తనకు అనుమతి ఇవ్వాలని ఆమె.. కేరళ హైకోర్టును ఆశ్రయించింది.
దేవానంద వేసిన పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. పిటిషనర్ తరపు మాటలు విన్న హైకోర్టు చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది. తండ్రిని రక్షించుకునేందుకు ఆ కూతురు పడుతున్న తాపత్రయానికి కోర్టు సైతం చలించింది. దీంతో ఆమె విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. లివర్ దానం చేసేందుకు ఆమెకు అనుమతి ఇచ్చింది. దీంతో దేవానంద తొలి మైనర్ అవయవదాతగా రికార్డ్ సృష్టించింది. తండ్రి కోసం ఆ బాలిక పడిన వేదనను చూసిన స్థానికులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. “లవ్ యూ తల్లి, నువ్వు సూపర్ తల్లి” అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ సైతం చేశారు. నాన్నకు ప్రేమతో దేవానంద చేసిన ఈ సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.