ప్రేమ చాలా అందమైన అనుభూతి.. ఒకప్పుడు ప్రేమికులు ఉత్తరాలు, గ్రీటింగ్స్ ద్వారా తమ ప్రేమను వ్యక్త పరిచేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. తమ గర్ల్ ఫ్రెండ్స్‌కు ప్రపోజ్ చేసేందుకు టెక్నాలజీనే వాడుతున్నారు. పలు రకాల సోషల్ మాద్యమాల ద్వారా తమ ప్రేమను వ్యక్తపర్చుతున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం తన ప్రేమను ప్రేమలేఖ ద్వారా ప్రేయసికి తెలపాలనుకున్నాడు. కానీ అదే అతనికి శాపంగా మారింది. ఈ ఘటన రోహ్తాస్‌లోని బిక్రమ్‌గంజ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
బిహార్ లో ఓ యువకుడు తన ప్రేయసికి సోషల్ మాద్యమాల ద్వారా కాకుండా స్వయంగా ప్రేమలేఖ ఇచ్చి తన ప్రేమను మనస్ఫూర్తిగా వెల్లడించాలని అనుకున్నాడు. తన మనసులోని భావాలు లేఖలో పొందుపరిచి ఆ లేఖను ప్రేయసిని ఇచ్చేందుకు అంతా సిద్దం చేసుకున్నాడు.
ప్రేమలేఖ ఇవ్వాలన్న తొందరపాటులో ప్రియురాలి ఇంటికి వెళ్లకుండా పొరపాటున వేరే ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి యజమాని రావడంతో కంగారుపడి డాబా పై ఉన్న వాటర్ ట్యాంకర్ లోకి దూరాడు. మనోడి కర్మ కాలి యజమానికి చిక్కడంతో చతకబాది పోలీసులకు అప్పజెప్పారు.
పోలీసులు ఆ యువకుడిని విచారించగా తాను వర్నా గ్రామానికి చెందిన వాడినని.. తాను ఏ దొంగతనం చేయడానికి వెళ్లలేదని.. తన ప్రియురాలికి ప్రేమ లేఖ ఇవ్వాలని వచ్చానని.. పొరపాటున వేరే ఇంటికి వెళ్లానని.. అక్కడ యజమానిని చూడటంతో భయంతో దాక్కున్నానని అన్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Gujarat: దారుణం: కన్న తల్లిని గొంతు కోసి చంపిన కసాయి కొడుకు