అక్రమ సంపాదన కోసం ఆరాపడే వారి సంఖ్య సమాజంలో బాగా పెరిగిపోయింది. అందుకే అడ్డదారుల్లో పరులు కష్టపడి సంపాదించి.. కూడబెట్టిన సొమ్మును దొంగిలిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే నోరు లేని మూగ జీవాలను సైతం చోరీ చేస్తుంటారు. దొంగిలించే సమయంలో వాటిపై కూర్రత్వం ప్రదర్శిస్తారు.
అక్రమ సంపాదన కోసం ఆరాపడే వారి సంఖ్య సమాజంలో బాగా పెరిగిపోయింది. అందుకే అడ్డదారుల్లో పరులు కష్టపడి సంపాదించి.. కూడబెట్టిన సొమ్మును దొంగిలిస్తుంటారు. ఇళ్లు, దుకాణాల్లో చొరబడి విలువైన వస్తువులను చోరీ చేస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే రైతు పండించే పంటను, పోషించే మూగ జీవాలను కూడా కొందరు కేటుగాళ్లు చోరీ చేస్తున్నారు. రాత్రులో కొట్టాల్లోకి వెళ్లి.. పశువులను దొంగిలించే వారు. ఇలా దొంగిలించే సందర్భంలో వాటిని దారుణంగా హింసిస్తారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలోని ప్రకారం.. ఓ ట్రక్కు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తుంది. ఈ సమయంలో మరో వాహనం నుంచి ఓ వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. ఆ వ్యక్తి కూడా లారీపై నిలబడి ఉండటం గమనించవచ్చు. సదరు వ్యక్తి ట్రక్కులో ఉన్న మేకలను రోడ్డుపై నేరుగా విసిరేస్తున్నాడు. అతని ముఠాలోని మరికొందరు సభ్యులు లారీ వెనుక కారులో వెళ్తున్నారు. ట్రక్కులోని మేకలను రోడ్డు విసిరిన తర్వాత యువకుడు అందులో నుంచి కిందకు దూకి.. వారి కారులో జారుకున్నాడు. అయితే వీడియోను కారు డ్రైవర్ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియో విష్ణు తివారి అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. “ఇది ఏ సినిమాలోని సన్నివేశం కాదు, కాన్పూర్-లక్నో జాతీయ రహదారిపై రన్నింగ్ లో ఉన్న ట్రక్కు నుండి మేకలు దొంగిలించబడుతున్నాయి” అని వీడియోకు క్యాప్షన్ జోడించి ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దొంగలు మూగ జీవాల పట్ల కూర్రంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని వీలైనంత త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. మీరు ఈ వీడియోను వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ये कोई फिल्मी सीन नहीं है, #कानपुर–#लखनऊ हाइवे पर चलते ट्रक से कार सवार कर रहे बकरे चोरी । pic.twitter.com/QhZGTAWQch
— Vishnu Tiwari (@vishnutiwariKNP) April 30, 2023