కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు అని ఓ కవి చెప్పినట్లు.. కృషీ-పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని నిరూపించాడు ఓ దినసరి కూలీ కొడుకు. చిన్నతనం నుంచి తాను డాక్టర్ కావాలని కోరిక ఉన్నా.. అందుకు సరైన సౌకర్యాలు లేవు. ఎందుకంటే ఆ విద్యార్థి తండ్రి భవన నిర్మాణం కూలీ. రోజూ పనిచేస్తే కానీ పూటగడవని దీన స్థితి. అయినా మొక్కవోని ధైర్యంతో తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటు రాత్రీ, పగలూ కష్టపడ్డాడు. అనుకున్న ఫలితాన్ని సాధించాడు. నీట్ ప్రవేశ పరీక్షలో 720కి 626 మార్కులు సాధించి.. సీటు సంపాదించాడు. ప్రస్తుతం అతడు గ్రామంలో తొలి డాక్టర్ కాబోతున్నాడు. తన కుటుంబం కన్న కల నిజం చేయబోతున్నాడు. రాజస్థాన్ లోని బార్మెర్‌లో పేద కుటుంబంలో పుట్టిన దుధారామ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు.
రాజస్థాన్ లోని బార్మెర్‌లో పేద కుటుంబంలో పుట్టిన దుధారామ్ ఉండే సందారీ తెహసిల్‌లో 250 ఇళ్లు ఉన్నా.. కరెంటు ఉండేది మాత్రం రోజుకి ఐదారు గంటలే. ఇక మంచి నీటి కోసం దాదాపు పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి రావాల్సిందే. దుధారామ్ తల్లి దినసరి కూలీ.. తండ్రి భవన నిర్మాణం కూలీ. ఓ చిన్న పూరి గుడిసెలో జీవిస్తుంటారు. ప్రతిరోజూ కూలీకి వెళ్తే కానీ పూటగడవని పరిస్థితి.. అయితే దుధారామ్‌కి బాగా చదివి డాక్టర్ కావాలన్నది కల. టెన్త్, ఇంటర్‌లో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకున్న దుధారమ్‌లో టాలెంట్ గుర్తించిన స్కూల్ టీచర్ రాజేంద్ర సింగ్ ఎలాగైనా డాక్టర్ కావాలని.. తమ గ్రామానికి మంచి వైద్యం అందించాలని ప్రోత్సహించడం మొదలు పెట్టాడు.
ఈ నేపథ్యంలో దుధారామ్ ఓ కోచింగ్ సెంటర్ లో చేరి NEETకి ప్రిపేర్ అయ్యాడు. దుధారామ్ మార్కులు, ఉత్సాహం చూసి కోచింగ్ సెంటర్ 50 శాతం ఫీజు తగ్గించారు. కోచింగ్ తీసుకుంటూనే ఆన్‌లైన్‌లో చదివి నాలుగో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించాడు. తనలాంటి పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే కోరిక ఉన్నా సరైన గైడెన్స్ లేక పేదరికంలో కొట్టుకుపోతున్నారని.. న లాంటి విద్యార్థుల్లో చైతన్యం నింపుతాను అంటున్నాడు. మరెంతో మంది కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో విజయం సాధించేలా సలహాలు, సూచనలూ ఇస్తానంటున్నాడు.
Dudharam, a resident of Barmer, Rajasthan, is now all set to become the first doctor from his village after scoring 626/720 in the #NEETUG2021. Despite the hardships he faced in his life, he studied hard to achieve his goal.https://t.co/X30eORfpxv@ibtimes_india @mansukhmandviya
— ALLEN Career Institute (@ALLENkota) November 26, 2021