చేసే పని ఏదైనా సరే అది మనకు సంతృప్తిని ఇస్తే చాలు. బతుకుదెరువుకోసం, కుటుంబ పోషణ కోసం ఏదో ఒక వృత్తిని ఎంచుకుని జీవనం కొనసాగిస్తారు. వారు చేసే వృత్తే దైవంలా భావిస్తారు. ఇదే విషయానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. ఓ డ్రైవర్ తను పదవీ విరమణ చేసిన సమయంలో ఆ వాహనం పై చూపిన ప్రేమ అందరి గుండెల్ని పిండేస్తుంది. తనకు అన్నం పెట్టిన ఆ వృత్తికి వీడ్కోలు పలికే సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతకీ ఏం జరిగింది.. ఆ డ్రైవర్ ఎందుకలా కన్నీటి పర్యంతమయ్యారో ఇప్పుడు చూద్దాం.

ఏ రాష్ట్రంలోనైనా ప్రజా రవాణాలో ఆర్టీసిదే కీలక పాత్ర. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఓ డ్రైవర్ విధుల నుంచి పదవీ విరమణ తీసుకునే సమయంలో ఆ బస్సును చూసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. బస్సు స్టీరింగ్ ను ముద్దాడి, బస్సును ఆలింగనం చేసుకుని, రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ బస్సు పట్ల ఆప్యాయతను చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన వృత్తి పట్ల ఎంతటి అంకితభావం ఉందో తెలుస్తోందని డ్రైవర్ ను ఉద్దేశిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థలో ఓ డ్రైవర్ కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో ఆ డ్రైవర్ కు పదవీ విరమణ చేసే సమయం రానే వచ్చింది. దీంతో ఆ డ్రైవర్ తన వృత్తికి వీడ్కోలు పలుకుతూ ఆ బస్సును చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ బస్సుతో తనకున్న అనుభందాన్ని గుర్తు చేసుకుంటూ బస్సు స్టీరింగ్ కు ముద్దుపెట్టి, క్లచ్, బ్రేక్, గేర్ ఇలా ప్రతి విడిభాగాన్ని తాకుతూ, నమస్కరించి బస్సును కౌగిలించుకుని ఉద్వేగానికి లోనయ్యారు. దీనిని అక్కడే ఉన్న తోటి ఉద్యోగులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది.
On his last day of work, a #TNSTC bus driver gets emotional. The bus driver, who had been with TNSTC for 30 years, was seen kissing and hugging the vehicle. The video has gone viral on #socialmedia. pic.twitter.com/Nsu17lNtRT
— The New Indian Express (@NewIndianXpress) June 1, 2023