సాధారణంగా రాజకీయ నాయకులు ఓట్ల కోసం అనేక పాట్లు పడుతుంటారు. ప్రజల వద్దలకు వెళ్లి.. తమను గెలిపించాలని ప్రాధేయపడుతుంటారు. జనం ఎంత విసిగించుకున్నా.. ఓపికగా ఉండి ఓటు వేయమని అభ్యర్ధిస్తుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో కాళ్లు పట్టుకున్నంత పనిచేస్తుంటారు. ఇంక కొందరు రాజకీయ నాయకులు ఓట్ల కోసం జనాల కాళ్లు సైతం పట్టుకున్న సందర్భాలు మనం అప్పుడప్పుడు చూస్తుంటాము. అయితే తాజాగా కొందరు యువకులు అమ్మాయిల వెంటపడి మరి ఓట్లు అడిగారు. ఇంకా ఒక మెట్టు కిందకు దిగి వారి కాళ్లు పట్టుకుని మరి.. ఓట్లు వేయపని ప్రాధేయపడ్డారు. ఇంతకు ఆ యువకులు ఏమైన ఎమ్మెల్యే, ఎంపీ లేదా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్నారా అనే సందేహం రావచ్చు. అయితే ఆ యువకులు ఏం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజస్థాన్ రాష్ట్రం బరాన్ లో శుక్రవారం విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. అయితే అన్ని విద్యార్థి సంఘాల ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ప్రచారాన్ని విద్యార్ధులు, వారి నాయకులు కొత్త పుంతలు తొక్కించారు. సరికొత్త ప్రచారంతో విద్యార్ధులను ఓట్ల వేయాలని వేడుకున్నారు. ప్రచారంలో భాగంగా అభ్యర్ధులు విద్యార్ధి, విద్యార్ధినిల కాళ్లపై పడి ఓటు వేయమని అడుగుతున్నారు. దయచేసి తమ విలువైన ఓటు తమకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రాధేయపడ్డారు. అటుగా వస్తున్న అమ్మాయిల కాళ్లపై పడ్డారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు, వారి తరపువారు. అమ్మాయిలు అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటున్న వాళ్ల కాళ్లు మాత్రం వదలటం లేదు.
నేలపై పడుకుని మరీ కాళ్లను పట్టుకుని వేడుకున్నారు. విద్యార్ధినిల కాళ్లు దొరక్కపోతే నేలపై పడుకుని దండం పెట్టి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. రెండు చేతులు జోడించి శిరసు వంచి నమస్కరించి తమను గెలిపించాలని కోరారు. అయితే వీరి చర్యలతో కొందరు విద్యార్థినులు అసౌకర్యానికి గురి కాగా, కొందరు నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ ఎన్నికల ప్రచారంకి సంబంధించిన వీడియోను ఒక విద్యార్థి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి… ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
राजस्थान विश्वविद्यालय छात्र संघ चुनाव के दौरान प्रत्याशियों ने सड़क पर लेटकर पैर पकड़कर माँगे वोट. pic.twitter.com/rmvlgCFXgJ
— UnSeen India (@USIndia_) August 26, 2022