భార్యను వేధిస్తున్న భర్తలు అనే వార్తలు మనం నిత్యం వింటుంటాము. మహిళలు కష్టాలు చూసి కొందరు అయ్యో పాపం అంటారు. కానీ అదే వేధింపులు మగాడి వస్తే.. లోకం వింతగా చూస్తుంది. పైగా చేతకానీ వాడు అంటూ హేళన చేస్తుంది. దీంతో కొందరు బయటకు చెప్పుకోలేరు. అలానే భరిస్తూ కాలం వెల్లదీస్తుంటారు. అయితే కొందరు మాత్రం భార్య వేధింపులను భరించాలేక పారిపోతుంటారు. తాజాగా ఆ కోవకు చెందిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. భార్య తరచూ గొడవపెట్టుకుని, కొడుతుందని, ఆ వేధింపులు తట్టుకోలేక 80 అడుగుల ఎత్తు ఉన్న చెట్టు ఎక్కాడు ఓ భర్త. ఎంతమంది చెప్పిన భార్య దెబ్బకు బయపబడి కిందకు దిగ్గలేదు. అలా నెల రోజు నుంచి అక్కడే ఉన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని కోపగంజ్ అనే ప్రాంతంలోని ఓ గ్రామంలో రామ్ ప్రవేశ్ అనే వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆయనతో భార్య నిత్యం గొడవ పెట్టుకునేది. మరికొన్ని సార్లు కోపంతో రామ్ ప్రవేశ్ పై భౌతిక దాడి చేస్తుంది. ఇలా కొన్నాళ్లు భరిస్తూ వచ్చాడు రామ్ ప్రవేశ్. అయినా ఆయన భార్య వేధింపులు, దాడులు ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఇక భరించడం తన వల్ల కాదని.. ఈ నరకం నుంచి విముక్తి పొందాలనుకున్నాడు. దీంతో 100 అడుగుల పామ్ చెట్టు ఎక్కాడు రామ్ ప్రవేశ్. విషయం తెలుసుకున్న భార్య, పిల్లలు, బంధువులు చెట్టు దగ్గరికి వెళ్లి.. కిందరు రమ్మని బ్రతిమిలాడారు. అయిన ఎవరిమాట వినని రామ్ ప్రవేశ్.. ఏకంగా నెలరోజుల నుంచి అక్కడే ఉంటున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు తాడు సహాయంతో నీళ్లు, ఆహారం పైకి పంపిస్తున్నారు. అయితే మరోవైపు గ్రామస్థులు ఓ ఆరోపణ చేస్తున్నారు. రామ్ ప్రవేశ్ తమ ఇళ్లలో ఏం జరుగుతుందో తొంగి చూసేందుకే చెట్టుపైకి ఎక్కడాని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు వచ్చి..ప్రయత్నించిన రామ్ ప్రవేశ్ ను కిందకు దించలేకపోయారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: చిన్న వయసులోనే పెళ్లి, బాధ్యతలు అయినా పట్టు వదల్లేదు.. నేడు DSP! ఇదీ చదవండి: వీడియో: పిల్లలి ఆకలి తీర్చేందుకు ఓ తండ్రి కష్టం!